న్యూడిల్లీ: టీఆర్ఎస్ పార్టీ తరపున పెద్దపల్లి లోక్ సభ స్థానం నుంచి పార్లమెంట్‌కి ఎన్నికైన ఎంపీ బాల్క సుమన్ నేడు తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్, డా బూర నర్సయ్య గౌడ్ వెంట రాగా.. ఎంపీ సుమన్ తన రాజీనామా లేఖను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు అందజేశారు. పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతూనే ఇటీవల జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి 28,132 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇప్పటివరకు పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగిన బాల్క సుమన్ ఇకపై రాష్ట్ర ప్రభుత్వంలో కొనసాగాలనే ఆలోచనతోనే చెన్నూరు నుంచి పోటీ చేసి విజయం సాధించినట్టు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఇదిలావుంటే, బాల్క సుమన్ తరహాలోనే ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి 87,990 ఓట్ల మెజార్టీతో గెలిచిన మల్లారెడ్డి సైతం తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.