MP Maloth Kavitha: హైదరాబాద్: మహబూబాబాద్ లోక్ సభ స్థానం నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవితకు ప్రజాప్రతినిధుల కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. 2019 పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సమయంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారనే ఆరోపణలపై అప్పట్లో కవితపై బూర్గం పహాడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసుపై విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల కోర్టు.. కవితకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: Etela Rajender చిన్నోడు.. ఈటల వచ్చేది లేదు సచ్చేది లేదు.. CM KCR phone call leaked


ఈ కేసులో కవితకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు 10 వేల రూపాయల జరిమానా విధిస్తున్నట్టు ప్రజాప్రతినిధుల కోర్టు స్పష్టంచేసింది. ప్రజాప్రతినిధుల కోర్టు (Public representatives court) తీర్పుతో ఖంగుతిన్న మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత (TRS).. కోర్టు తీర్పును సవాలు చేస్తూ పై కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.


Also read: Motkupalli ‍‍‍Narsimhulu resigned to BJP: ఈటల రాజేందర్‌పై ఆరోపణలతో బీజేపికి మోత్కుపల్లి నర్సింహులు గుడ్‌బై


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook