Attack on MP Arvind: కరీంనగర్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కారుపై దాడి జరిగింది. జగిత్యాలకు వెళ్లిన ఎంపీ అర్వింద్ కారుపై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు, ఈ ఘటనలో అర్వింద్ కాన్వాయ్ లోని రెండు కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఎంపీ కారుపై దాడి జరగడంతో జగిత్యాలలో తీవ్ర ఉద్రికత్త తలెత్తింది. అర్వింద్ ఎద్దండి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని నినాదాలు చేస్తూ ఎంపీ అర్వింద్ కారుపై దాడి చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వరదలకు ముంపుు గురైన గోదావరి పరివాహక గ్రామం ఎల్దండికి వచ్చారు ఎంపీ అర్వింద్. అయితే అక్కడ ఎంపీ కి చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల సమయంలో ఎంపీ గా గెలిపిస్తే గ్రామంలో బ్రిడ్జి కట్టిస్తానన్న హామీ మరియు గ్రామంలో ఉన్న మల్లన్న గుట్ట సమస్య పరిష్కరిస్తానన్న హామీ ఏమైందని  గ్రామస్థులు నిలదీసారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు ఆయన వెంట వచ్చిన కాన్వాయ్ లోని రెండు వాహనాల అద్దాలు పగలగొట్టారు. పెద్ద ఎత్తున పోలీసులను మోహరించిన నిరసన కారులు ఆగలేదు వాహనాలపై చెప్పులు విసిరారు. అయితే అర్వింద్ పై దాడి చేసింది టీఆర్ఎస్ కార్యకర్తలని బీజీపీ నేతలు చెబుతున్నారు.


Read also: Godavari Flood: రూ. వేల కోట్లు నీటి పాలు.. వరదల్లో మునిగిన కాళేశ్వరం బాహుబలి మోటార్లు.. కేసీఆర్ సిగ్గుపడాలన్న బండి సంజయ్


Read also: Telangaan Floods:కాళేశ్వరం బ్యారేజీకి రివర్స్ వరద.. కంట్రోల్ రూమ్ లో చిక్కుకుపోయిన 105 మంది సిబ్బంది



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook