హైదరాబాద్: నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) పుట్టినరోజు. కేసీఆర్ మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామంలో  ఫిబ్రవరి 17, 1954న జన్మించారు. ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. ప్రముఖులు కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర మంత్రి, కేసీఆర్ తనయుడు కేటీఆర్ తన తండ్రి కేటీఆర్‌కు పుట్టినరోజు విషెస్ తెలిపారు. ఈ మేరకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: మలైకా అరోరా, అర్జున్ రిలేషన్ దెబ్బకొట్టింది!


‘బహుముఖ ప్రజ్ఞాశాలి, నిరంతర శ్రామికుడు, ఎల్లప్పుడూ అందర్నీ ఉత్సాహపరిచే వ్యక్తి, డైనమిక్ నేత నా తండ్రి అని చెప్పుకునేందుకు చాలా గర్వపడుతున్నాను. మీరు మరింత కాలం హాయిగా జీవించాలి. మీ నిబద్ధత, మీ విజన్‌తో ఇదే విధం గా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. తల్లిని కన్న తనయుడికి జన్మదిన శుభాకాంక్షలు’ అని తండ్రి కేసీఆర్‌కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు.


Also Read: రికార్డులు తిరగరాసిన ప్రభాస్ ‘సాహో’ 



కేసీఆర్ స్కెచ్ పెయింటింగ్ ఫొటోను జతచేస్తూ తండ్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. తెలంగాణ పేరును చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన చంద్రశేఖరుడికి జన్మదిన శుభాకాంక్షలు అని విషెస్ తెలుపుతున్నారు. మా ఆయుష్షు కూడా తీసుకుని నిండు నూరేళ్ళు ఆయూరారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానంటూ కేసీఆర్ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.


Also Read: కేసీఆర్‌కు ప్రధాని మోదీ, జగన్, చంద్రబాబు బర్త్ డే విషెస్


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..