‘బాహుబలి’ సినిమాలతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా ఈ ప్రాజెక్టులు తెలుగు చిత్రపరిశ్రమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాయి. బహుబలి 2 తర్వాత సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సినిమా సాహో. గత ఆగస్టు 30న విడుదలైన సాహో మూవీ బాక్సాఫీసులు వద్ద రూ.400 కోట్ల మేర వసూళ్లు రాబట్టినా అభిమానులు మాత్రం నిరాశచెందారు. బాహుబలి సినిమాలతో బాలీవుడ్‌కు బాగా దగ్గరయ్యాడు ప్రభాస్. ఈ క్రమంలో సాహో మూవీ సరికొత్త రికార్డులు సృష్టించింది.
Also Read; ఆ హీరోయిన్ వచ్చిన వేళా విశేషం.. నితిన్‌కు పెళ్లి!
టీవీలో అత్యధిక టీఆర్పీ సాధించిన సినిమాగా ప్రభాస్ సినిమా సాహో నిలిచింది. ఈ మూవీ హిందీ వెర్షన్ జనవరి 26న టీవీలో ప్రసారం కాగా, 1.28కోట్ల మంది (వ్యూవర్ షిప్ వచ్చింది) వీక్షించినట్లు బార్క్ (బ్రాడ్‌కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్) లెక్కలు చెబుతున్నాయి. గతంలో అత్యధిక మంది టీవీల్లో వీక్షించిన సినిమాలను ‘కాలీ కా కర్మిషా’, ‘సింబా’, ‘పోలీస్ ఔర్ టైగర్’, ‘కేజీఎఫ్ చాప్టర్ 1’ అధిగమించి నెంబర్ వన్‌గా నిలిచింది.
Also Read: మలైకా అరోరా, అర్జున్ రిలేషన్ దెబ్బకొట్టింది!
Also Read: ఉత్తమ నటిగా RRR భామ.. రాజమౌళి నిర్ణయం కరెక్ట్!
కాగా, ప్రభాస్ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు గత నెలలో జపాన్‌లోనూ సాహోను విడుదల చేసిన విషయం తెలిసిందే. గతంలో బాహుబలి 2 మూవీ అక్కడ విజయవంతంగా 100 రోజులు ప్రదర్శితమవడం విశేషం. యూవీ క్రియేషన్స్ నిర్మించిన సాహో సినిమాలో ప్రభాస్‌కు జోడీగా శ్రద్ధా కపూర్ నటించింది. జాకీ ష్రాఫ్, మందీరా బేడీ, నీల్ నితిన్ ముఖేశ్, అరుణ్ విజయ్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ కీలకపాత్రల్లో పోషించారు.
Also Read: సినిమా షూటింగ్ కాదు.. బెజవాడలో పెళ్లిసందడి