ఫిబ్రవరి 24వ తేదీ నుంచి జరగనున్న టీఆర్‌టీ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్‌ను టీఎస్పీఎస్సీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. టీఆర్‌టీ తెలుగు పండిట్, స్కూల్ అసిస్టెంట్ తెలుగు పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్స్ ప్రస్తుతం టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌లో అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో వున్నాయి. ఈ నెల 24న తెలుగు పండిట్, స్కూల్ అసిస్టెంట్ తెలుగు పరీక్ష జరగనున్న సంగతి తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Click here for TRT hall tickets direct download link 


టీఆర్‌టీ పరీక్ష సెంటర్ల కేటాయింపులో పలు తప్పులు దొర్లిన నేపథ్యంలో గతంలో ఈ పరీక్షల హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్‌ను నిలిపివేసిన టీఎస్పీఎస్సీ తాజాగా ఆ తప్పిదాలను సరిదిద్దుకుని ఆ హాల్ టికెట్స్‌ని మరోసారి వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. తప్పిదాలపై పూర్తిస్థాయిలో సమీక్ష జరిపి, ఆ తప్పిదాలను సరిదిద్దిన తర్వాతే బుధవారం మధ్యాహ్నం నుంచి హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ వాణీ ప్రసాద్ తెలిపారు. ఈ నెల 24 నుంచి యథావిధిగా టీఆర్‌టీ పరీక్షలు జరుగుతాయని ఆమె స్పష్టంచేశారు.