తెలంగాణ ఎంసెట్ 2020 ( TS EAMCET 2020 ) అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ ఫలితాలు వెల్లడయ్యాయి. విద్యార్థులు emcet.tsche.ac.in పోర్టల్ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. మెడికల్, అగ్రికల్చర్ ఫలితాలను డౌన్ లోడ్ చేసుకోవాలి అనుకుంటున్న అభ్యర్థులు పోర్టల్ లో తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన రోజు వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Keerthy Suresh: కీర్తి సురేష్ మిస్ ఇండియా ట్రైలర్ విడుదల


తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ ఫలితాలను తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ ఎంసెట్ చైర్మన్ టీ పాపిరెడ్డి, ఎంసెట్ కన్వీనెర్ గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్ లోని జవహార్ లాల్ టెక్నోలాజికల్ యూనివర్సిటీ లోని ( JNTU ) యూజీసి-హెచ్చార్డీసి ఆడిటోరియంలో లాంచ్ చేశారు. సుమారు 80.85 శాతం విద్యార్థులు పరీక్షలకు హాజరు అయినట్టు సమాచారం. 


కరోనావైరస్ ( Coronavirus) వల్ల ఈ ఏడాది ఇంజినీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ ఎంట్రాన్స్ పరీక్షలను వేరు వేరుగా నిర్వహించారు. ఈ పరీక్షలను సెప్టెంబర్ 28, 29 న నిర్వహించగా 63,857 మంది విద్యార్ధులు పాల్గొన్నారు. ఇందులో 59,113 విద్యార్ధులు క్వాలిఫై అయ్యారు. 



Also Read | Rajasekar Health Condition: నిలకడగా రాజశేఖర్ ఆరోగ్యం.. కోలుకున్న జీవిత


తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ ఫలితాలు ఈ ఫార్మెట్ లో అందుబాటులో ఉన్నాయి: హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, జెండర్, లోకల్ ఏరియా, కేటగిరి, ఎంసెట్ వెయిటేజ్, ఇంటర్ వెయిటేజ్, కంబైన్డ్ స్కోర్, ర్యాంకు, ఫలితాలు.


ఇప్పుడే ఫలితాలు చెక్ చేసుకోవలి అంటే క్లిక్ చేయండి



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR