TS EAMCET 2021 Last Date For Online Applications:  ఇంటర్ పూర్తయిన విద్యార్థులకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి మరో అవకాశం ఇచ్చింది. జూన్ 3తో ముగియనున్న తెలంగాణ ఎంసెట్ దరఖాస్తుల గడువును జూన్ 10వ తేదీ వరకు పొడిగించారు. ఇంజినీరింగ్‌, వ్యవసాయ మరియు మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రతి ఏడాది తెలంగాణ ఎంసెట్ 2021ను నిర్వహించనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుల గడువును జూన్ 10 వరకు పొడిగించినట్లు టీఎస్ ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ తెలిపారు. పొడిగించిన నిర్ణీత తేదీ (TS EAMCET 2021 Last Date)లోగా దరఖాస్తు చేసుకునే వారి నుంచి ఎలాంటి లేట్ ఫీజు వసూలు చేయడం లేదని పేర్కొన్నారు. ఇంటర్మీడియెట్ పూర్తయిన విద్యార్థులు (TS EAMCET 2021) వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


Also Read: Telangana కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్‌ విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి


తెలంగాణ ఎంసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల తుది గడువు జూన్ 28 అని తెలిపారు. అయితే ఆలస్య రుసుము రూ.5000 చెల్లించాల్సి ఉంటుందని ఎంసెట్ కన్వీనర్ వెల్లడించారు. గత ఏడాది కన్నా ప్రస్తుత అకాడమిక్ ఇయర్‌కు అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. గడువు పొడిగించినందున టీఎస్ ఎంసెట్‌ 2021కు మరిన్ని దరఖాస్తులు (TS EAMCET 2021 Application Form) వస్తాయన్నారు. జూలై 5 నుంచి 9 తేదీల మధ్య జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్ (JNTUH) తెలంగాణ ఎంసెస్ నిర్వహించనుందని తెలిసిందే.


Also Read: TS EAMCET: తెలంగాణ ఎంసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook