TS Eamcet 2022 Result: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు నేడే..! విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
TS Eamcet 2022 Result: రాష్ట్రంలోని యూనివర్సిటీలు, టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకై నిర్వహించే ఎంసెట్ ఫలితాలు ఇవాళ విడుదలయ్యే అవకాశం ఉంది.
TS Eamcet 2022 Result: రాష్ట్రంలోని యూనివర్సిటీలు, టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకై నిర్వహించే ఎంసెట్ ఫలితాలు ఇవాళ విడుదలయ్యే అవకాశం ఉంది. తెలంగాణ ఎంసెట్ ఫలితాల తేదీపై అధికారిక ప్రకటన లేనప్పటికీ.. ఈ వారం ఫలితాలు విడుదలవుతాయనే సమాచారం ఉంది. గురువారం (ఆగస్టు 11) హైదరాబాద్ జేఎన్‌టీయూహెచ్‌లో ఎంసెట్ కమిటీ సమావేశం జరిగిన నేపథ్యంలో ఫలితాలు ఇవాళ విడుదల కావొచ్చుననే ప్రచారం జరుగుతోంది.
ఎంసెట్ ఫలితాలు విడుదల చేసే పక్షంలో ఈ ఉదయం 11 గంటలకు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఫలితాలను eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. manabadi.co.in లాంటి థర్డ్ పార్టీ సైట్స్‌లోనూ ఎంసెట్ ఫలితాలు అందుబాటులో ఉంటాయి. అప్లికేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ తదితర వివరాలను ఎంటర్ చేసి ఫలితాలను పొందవచ్చు.
ఈ ఏడాది షెడ్యూల్ ప్రకారం ఎంసెట్ పరీక్ష జూలై 14, 15 తేదీల్లో నిర్వహించాల్సి ఉంది. అయితే భారీ వర్షాల కారణంగా జూలై 18,19, 20 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలను జూలై 30, 31 తేదీల్లో నిర్వహించారు. ఇంజినీరింగ్ పరీక్షలకు మొత్తం 1,72,273 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1,56,812 మంది విద్యార్థులు హాజరయ్యారు. అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో మొత్తం 94,476 మంది విద్యార్థులు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 80,575 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇప్పటికే ఎంసెట్ పేపర్స్ 'కీ' విడుదల చేశారు.
ఫలితాల విడుదల తర్వాత కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. బహుశా 10 రోజుల్లో కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశం ఉండొచ్చు. మొదట సర్టిఫికెట్ల వెరిఫికేషన్, రెండో దశలో వెబ్ ఆప్షన్స్, మూడో దశలో సీట్ల కేటాయింపు ఉంటుంది.
Also Read : Raksha Bandhan Special Horoscope : రక్షా బంధన్ స్పెషల్.. నేటి రాశి ఫలాల్లో ఏయే రాశుల వారి జాతకం ఎలా ఉందంటే..
Also Read: Macherla Niyojakavargam: అమెరికా ప్రీమియర్ షోలన్నీ రద్దు.. అసలు ఏమైందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook