TS Eamcet 2022 Results: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల.. విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
TS Eamcet 2022 Result: తెలంగాణ ఎంసెట్ 2022 పరీక్షా ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ నుంచి ప్రకటన వెలువడింది.
TS Eamcet 2022 Result: తెలంగాణ ఎంసెట్ 2022 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదారాబాద్‌లోని జేఎన్‌టీయూహెచ్‌లో నేటి ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఎంసెట్ ఫలితాలు ప్రస్తుతం eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. తాజా ఫలితాల్లో ఇంజనీరింగ్ విభాగంలో లక్ష్మీసాయి లోహిత్ రెడ్డి స్టేట్ ఫస్ట్ ర్యాంక్, కార్తీకేయ స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించారు. అగ్రికల్చర్ విభాగంలో నేహా మొదటి ర్యాంకు, రోహిత్ రెండో ర్యాంకు సాధించారు.
ఎంసెట్ ఫలితాలు ఈ వెబ్‌సైట్స్‌లో :
eamcet.tsche.ac.in
manabadi.co.in
schools9.com
tsche.ac.in
ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి :
మొదట eamcet.tsche.ac.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
హోంపేజీలో ఎంసెట్ రిజల్ట్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి
మీ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయండి
స్క్రీన్‌పై మీ ఫలితాలు డిస్‌ప్లే అవుతాయి.
ఫలితాల కాపీని ప్రింటవుట్ తీసుకోండి.
రాష్ట్రంలోని యూనివర్సిటీలు, టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాల కోసం విద్యార్థులు ఎంసెట్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఎంసెట్ పరీక్ష జూలై 14, 15 తేదీల్లో నిర్వహించాల్సి ఉండగా భారీ వర్షాల కారణంగా జూలై 18,19, 20 తేదీల్లో నిర్వహించారు. అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలను జూలై 30, 31 తేదీల్లో నిర్వహించారు.మొత్తం 1,72,273 మంది ఇంజినీరింగ్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా 1,56,812 మంది హాజరయ్యారు. అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో మొత్తం 94,476 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 80,575 మంది హాజరయ్యారు. ఇప్పటికే ఎంసెట్ అన్ని పేపర్స్ 'కీ' విడుదల చేశారు. బహుశా మరో 10 రోజుల్లో మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. విద్యాశాఖ తేదీలు ప్రకటించాక సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత సీట్ల కేటాయింపు ఉంటుంది.
Also READ: Trump House: ట్రంప్ ఇంట్లో ఎఫ్‌బీఐ సోదాలు..ఖండించిన అమెరికా మాజీ అధ్యక్షుడు..!
Also Read: Chiranjeevi: సొంతూరి అభిమానికి మెగా సాయం.. దటీజ్ మెగాస్టార్ అంటూ ప్రసంశలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook