Telangana EAMCET Results check on eamcet.tsche.ac.in: ఇంటర్ పరీక్షల ఫలితాలు వచ్చేయడంతో ఎంసెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన విద్యార్థులు రిజల్ట్స్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా తెలంగాణ ఎంసెట్ ఫలితాల విడుదలపై క్లారిటీ వచ్చేసింది. ఈ నెల 25వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి. గురువారం ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ఫలితాలు విడుదలకానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు వెల్లడించింది. JNTU హైదరాబాద్‌లోని గోల్డెన్‌ జూబ్లీ హాలులో ఫలితాలను రిలీజ్ చేయనున్నారు. ఫలితాలను https://eamcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ ఎంసెట్ పరీక్షలు ఈ నెల 10, 11, 12, 13, 14 తేదీలలో రెండు షిఫ్ట్‌లలో జరిగాయి. మే 10, 11వ తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్‌, మే 12, 13, 14 తేదీల్లో ఇంజినీరింగ్‌ పరీక్షలు నిర్వహించారు. ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు.. మధ్యాహ్నం 3:00 నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పకడ్బందీగా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రైమరీ 'కీ'లు కూడా విడుదలైన విషయం తెలిసిందే. ఇంజినీరింగ్ పరీక్షలకు 1,95,275 మంది హాజరవ్వగా.. అగ్రికల్చర్‌ విభాగంలో 1,06,514 మంది పరీక్షలు రాశారు. ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షకు 2,05,351 మంది దరఖాస్తు చేసుకోగా.. 94.11 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.  


తెలంగాణ ఎంసెట్ పరీక్షలకు ముందు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజ్ ఇకపై ఉండదని ప్రకటించింది. వెయిటేజ్ మార్కుల విధానాన్ని శాశ్వతంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులపై ఇంటర్ మార్కుల భారం పడకూడదని ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్, మెడికల్, ఫార్మసీ రంగాల్లో ప్రవేశాలకు ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజ్ అమలు చేస్తూ తొలిసారిగా 2011లో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఎంసెట్ మార్కులకు 75 శాతం.. ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజ్ కేటాయించేవారు. ఈ రెంటింటిని కలిపి ర్యాంకులను రిలీజ్ చేసేవారు. ఇక నుంచి ఎంసెట్ మార్కుల ఆధారంగానే ర్యాంకులను కేటాయంచనున్నారు.


Also Read:  Ray Stevenson Death News: RRR మూవీ సీనియర్ నటుడు హ‌ఠాన్మ‌ర‌ణం.. కారణం ఇదే..!  


Also Read: GT vs CSK Dream11 Prediction Team: ప్లేఆఫ్స్ సమరం నేడే.. గుజరాత్ Vs చెన్నై.. డ్రీమ్ 11 టీమ్ ఇదే..!    


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి