Telangana EAPCET Counselling Dates: ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో బీటెక్‌లో ప్రవేశాలకు సంబంధించి టీఎస్‌ ఈఏపీసెట్‌ తొలి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. గురువారం నుంచి ఈ నెల 12వ తేదీ వరకు విద్యార్థులకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించే అవకాశం ఉంటుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎప్పుడు హాజరవుతారో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 36 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఎక్కడో ఒక చోట వెరిఫికేషన్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న వారు ఈ నెల 8 నుంచి 15వ తేదీ వరకు వారికి తమకు ఇష్టమైన కాలేజీలు, కోర్సులను ఎంచుకునేందుకు వెబ్‌ఆప్షన్లు ఇవ్వాలి. వెబ్ ఆప్షన్లు పూర్తయిన తరువాత ఈ నెల 19వ తేదీలోపు తొలి విడత సీట్లు కేటాయింపు జరుగుతుంది. కౌన్సెలింగ్‌ వెబ్‌సైట్‌ tgeapcet.nic.in ను సందర్శించండి. వెబ్‌సైట్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లింపు, సెల్ఫ్‌ రిపోర్టింగ్‌కు జూలై 19 నుంచి 23 వరకు అవకాశం ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Bhole Baba: తొక్కిసలాట ఘటనపై బోలే బాబా సంచలన ప్రకటన.. ఏమన్నారంటే? 


అర్హతలు ఇలా..


==> అభ్యర్థి తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారై ఉండాలి .
==> ఇంజనీరింగ్, ఫార్మసీలో అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించి డిసెంబర్ 31, 2024 నాటికి 16 ఏళ్ల వయస్సు పూర్తయి ఉండాలి. 
==> ఫార్మ్ డి (డాక్టర్ ఆఫ్ ఫార్మసీ) కోర్సుకు డిసెంబర్ 31, 2024 నాటికి 17 ఏళ్లు పూర్తయి ఉండాలి. 
==> అయితే స్కాలర్‌షిప్ పొందేందుకు గరిష్ట అర్హత వయస్సు ఓసీ అభ్యర్థులకు 25 సంవత్సరాలు, ఇతర అభ్యర్థులకు 29 సంవత్సరాలలోపు ఉండాలి. 


ఫస్ట్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇలా..


==> ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, స్లాట్‌ బుకింగ్‌- జూలై 04 నుంచి జూలై 12 వరకు
==> సర్టిఫికెట్ల పరిశీలన- జూలై 06 నుంచి జూలై 13 వరకు.
==> ఆప్షన్ల ఎంపిక- జూలై 08 నుంచి జూలై 15 వరకు.
==> ఆప్షన్ల ఫ్రీజింగ్‌- జూలై 15.
==> సీట్ల కేటాయింపు- జూలై 19
==> సెల్ఫ్‌ రిపోర్టింగ్‌- జూలై 19 నుంచి 23 వరకు.


సెకెండ్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇలా..


==> ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, స్లాట్‌ బుకింగ్‌- జూలై 26.
==> సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌- జూలై 27.
==> ఆప్షన్ల ఎంపిక- జూలై 27 నుంచి 28 వరకు.
==> ఆప్షన్ల ఫ్రీజింగ్‌- జూలై 28.
==> సీట్ల కేటాయింపు- జూలై 31.
==> సెల్ఫ్‌ రిపోర్టింగ్‌- జూలై 31 నుంచి ఆగస్టు 02 తేదీ వరకు.


లాస్ట్‌ స్టేజ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇలా..


==> ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, స్లాట్‌ బుకింగ్‌- ఆగస్టు 08.
==> సర్టిఫికెట్ల వెరిఫికేషన్- ఆగస్టు 09.
==> ఆప్షన్ల ఎంపిక- ఆగస్టు 09 నుంచి 10 వరకు.
==> ఆప్షన్ల ఫ్రీజింగ్‌- ఆగస్టు 10.
==> సీట్ల కేటాయింపు- ఆగస్టు 13.
==> సెల్ఫ్‌ రిపోర్టింగ్‌- ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు.


Also Read: విజయ్ లో త్రిషకి చిరాకు తెప్పించే విషయం.. అందువల్లే షూటింగ్స్ లో సైతం ఇబ్బంది!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter