TS Inter 2nd Year Results 2021: కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు కావడం తెలిసిందే. నేడు తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాలు (TS Inter 2nd Year Results 2021) విడుదల కానున్నాయి. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  మరికాసేపట్లో ఇంటర్ సెకండియర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలు విడుదల చేయనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేటి మధ్యాహ్నం సమయానికి తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థుల ఫలితాలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ ఇంటర్ విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ (www.tsbie.cgg.gov.in)లో ఫలితాలు చూసుకోవాలని అధికారులు సూచించారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ సాధ్యంకాలేదు. అయితే విద్యార్థులకు మార్కులు ఏవిధంగా ఇస్తారనే దానిపై ఇంటర్మీడియట్ బోర్డ్ ఇదివరకే ప్రకటించింది. ప్రథమ సంవత్సరంలో సాధించిన మార్కులనే రెండో ఏడాదిలో విద్యార్థులకు కేటాయించడం జరుగుతుంది.  


Also Read: Telangana Colleges Reopen: నేటి నుంచి తెలంగాణ‌లో కాలేజీలు ప్రారంభం


ప్రాక్టికల్స్‌లో అందరికీ 100 శాతం మార్కులు ఇవ్వనున్నారు. ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆ సబ్జెక్టులలో 35 శాతం మార్కులు కేటాయించి పాస్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో తొలుత టెన్త్, ఇంటర్ ఫస్టియర్ బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు చేశారు. అనంతరం సెకండియర్ పరీక్షలను సైతం రద్దు చేయడం తెలిసిందే. సీబీఎస్ఈ సైతం టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. TS Inter 2nd Year Results కోసం క్లిక్ చేయండి, లింక్ 2:  Telangana Inter 2nd Year Results Direct Link


Also Read: TS Inter results guidelines: ఇంటర్ ఫలితాల వెల్లడికి మార్గదర్శకాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook