TS inter 2020 results హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఫస్ట్ ఇయర్‌, సెకండ్ ఇయర్‌ పరీక్ష ఫలితాలను గురువారం మధ్యాహ్నం 3 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి నాంపల్లిలోని ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్ కమిషనర్‌ కార్యాలయంలో విడుదల చేస్తారని బోర్డు సెక్రటరీ సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి నెలలో లాక్ డౌన్‌కి ( Lockdown) ముందుగానే రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షలు పూర్తయ్యాయి. దాదాపు 9.50 లక్షలమంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. 


ఇంటర్ ఫలితాలు వెల్లడి అనంతరం రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ (TS inter marks recounting, reverification) ప్రక్రియకు  దరఖాస్తు చేసుకునేందుకు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు 2 వారాల గడువు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం జూలై 11 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు ఇంటర్ బోర్డు (TS intermediate board) వర్గాలు తెలిపాయి. గతేడాది ఇంటర్ ఫలితాల వెల్లడిలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుని వివాదానికి తావిచ్చిన నేపథ్యంలో ఈసారి ఇంటర్మీడియెట్ బోర్డు ఇంటర్ మూల్యాంకనంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.