Minister Mallareddy: తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి తరుచూ వివాదాల్లోకి చిక్కుకుంటారు. భూ వివాదాల్లో ఆయన పేరు తెరపైకి వస్తూ ఉంటోంది. మంత్రి మల్లారెడ్డి బంధువులపై గతంలోనూ చాలా కేసులు నమోదయ్యాయి. తాజాగా మరోసారి మంత్రి మల్లారెడ్డి వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన బావమరిదిపై భూకబ్జా కేసు వచ్చింది. మల్లారెడ్డి బావమరిది మద్దుల శ్రీనివాస్ రెడ్డి. అతని భార్య గుండ్ల పోచంపల్లి మున్సిపల్ చైర్ పర్సనగా ఉన్నారు. మంత్రి మల్లారెడ్డి బావమరిది  శ్రీనివాస్ రెడ్డి అనుచరులు తమను బెదిరించారని కొందరు బాధితులు పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేసు వివరాల్లోకి వెళితే మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి పరిధిలోని సర్వే నెంబర్ 5,6లోని కొంత భూమిపై రైతు మల్లారెడ్డి, వేణు నాయుడు అనే వ్యక్తుల మధ్య గొడవ జరుగుతోంది. అయితే ఈనెల 16న రాత్రి రైతు మల్లారెడ్డి... ఆ భూమి దగ్గరకు వచ్చాడు. 20 మందితో కలిసి వేణునాయుడు భూమిలోకి వెళ్లాడు. అక్కడ ఉన్న కడీలను ధ్వంసం చేశాడు. భూమికి సెక్యూరిటీ ఉన్న వ్యక్తులు అడ్డుకోవాలని ప్రయత్నించగా.. మల్లారెడ్డి మనుషులు వాళ్లపై దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాళ్లతో కొట్టారు. ఈ ఘటనలో వేణునాయుడి భూమికి కాపలాగా ఉన్న రాజు, చిన్నలు గాయపడ్డారు. దాడి చేసిన వాళ్లు తాము మంత్రి మల్లారెడ్డి బావమరిది మద్దుల శ్రీనివాస్ రెడ్డి అనుచరులమని చెప్పారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.15 మందిపై కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన 10 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. రైతు మల్లారెడ్డి, అతని కొడుకు విద్యాసాగర్ రెడ్డి ఇంకా దొరకలేదు. వాళ్లు పరారీలో ఉన్నారని పేట్ బషీరాబాద్ పోలీసులు సీఐ రమేష్ చెప్పారు. మంత్రి మల్లారెడ్డి బావమరిది శ్రీనివాస్ రెడ్డి పాత్రకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు.


READ ALSO: Auto-Cab Strike: జంట నగరాల్లో నిలిచిపోయిన ఆటో, క్యాబ్‌లు, ప్రజల ఇబ్బందులు


READ ALSO: PM Modi To Visit Hyderabad: మే 26న తెలంగాణకు ప్రధాని మోదీ.. మోదీ హైదరాబాద్ పర్యటన వెనుకున్న మర్మం ఏంటి ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook