TS Police Age Limit: పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ.. కానిస్టేబుల్, ఎస్సై వయో పరిమితి వివరాలు ఇవే!
TS Police Recruitment 2022 Age Limit. తెలంగాణలో కానిస్టేబుల్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయో పరిమితి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలానే 2022 జులై 1 నాటికి 25 ఏళ్లు దాటొద్దు.
TS Police Recruitment 2022 Age Limit: రాష్ట్ర నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించిన విషయం తెలిసిందే. తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సాయత్రం నోటిఫికేషన్ జారీ చేసింది. పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో కలిపి పెద్ద మొత్తంలో పోస్టులను కేసీఆర్ సర్కారు భర్తీ చేయనుంది. ఇందులో కానిస్టేబుల్ పోస్టులతో పాటు వివిధ విభాగాల్లో పెద్ద ఎత్తున సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి.
పోలీస్ పోస్టులకు దరఖాస్తులను మే 2 నుంచి 20వ తేదీ వరకు ఆన్ లైన్‌లో (www.tslprb.in) దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 17,099 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో 587 ఎస్ఐ, 414 సివిల్ ఎస్సైలతో పాటు.. 16,027 కానిస్టేబుల్, 66 ఏఆర్ ఎస్సై, 5 రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులను తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయనుంది.
కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో భాగంగా అత్యధికంగా టీఎస్‌ఎస్‌పీలో 5010, సివిల్‌లో 4965, ఏఆర్‌లో 4423 కానిస్టేబుల్ పోస్టులను కేసీఆర్ సర్కారు భర్తీ చేయనున్నారు. మరోవైపు అగ్నిమాపక, జైళ్ల శాఖ, ఐటీ విభాగంలోనూ పలు పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. కానిస్టేబుల్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయో పరిమితి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలానే 2022 జులై 1 నాటికి 25 ఏళ్లు దాటొద్దు.
తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌లో 587 ఎస్‌ఐ, 414 సివిల్ ఎస్‌ఐలు, 66 ఏఆర్ ఎస్‌ఐ, 23 టీఎస్‌ఎస్‌పీ ఎస్‌ఐ, 5 రిజర్వ్ ఎస్‌ఐ, 12 ఎస్‌పీఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. అలానే విపత్తు, అగ్నిమాపక శాఖలోనూ 26 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు, 8 డిప్యూటీ జైలర్ పోస్టులు ఉన్నాయి. ఎస్‌ఐ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థి ఏజ్ లిమిట్ కనీసం 21 సంవత్సరాలు. 2022 జులై 1 నాటికి 28 ఏళ్లు నిండకూడదు. ఇక కానిస్టేబుల్, ఎస్‌ఐ పోస్టుల కోసం అప్లై చేసుకునే బీసీ, ఎస్సి, ఎస్టీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల అదనపు వయో పరిమితి ఉంది.
Also Read: Rohit Sharma Note: నేను ఈ జట్టును ప్రేమిస్తున్నా.. రోహిత్ శర్మ భావోద్వేగం!
Also Read: Good Luck Gifts: ఈ బహుమతులను ఇచ్చినా.. తీసుకున్నా అదృష్టమే! అవేంటో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.