TS RTC to run special buses to Sabarimala and give 5 tickets free in every Bus: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలను తీసుకుంటూనే ఉంది. ప్రయాణికుల అవసరాలకు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు బస్సులు (Buses) నడుపుతూ ఉంది. ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకునే పనిలో ఉంది తెలంగాణ ఆర్టీసీ (Telangana RTC). ఇప్పటికే కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక బస్సులను నడుపుతుంది టీఎస్ ఆర్టీసీ. ఇక తాజాగా అయ్యప్ప స్వాముల (Ayyappa Swami) కోసం శబరిమలకి బస్సు సర్వీసులు ప్రారంభించాలని నిర్ణయించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఎక్కువ మంది భక్తులు అయ్యప్ప మాల విరణమ కోసం శబరిమలకి వెళ్తుంటారు. అయితే చాలా మంది ప్రైవేటు వెహికల్స్‌నే (Private Vehicles‌) ఆశ్రయిస్తుంటారు. కాగా అయ్యప్ప భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. శబరిమలకి వెళ్లే భక్తులు ఆర్టీసీ బస్సును బుక్‌ చేసుకుంటే అదే బస్సులో మరో ఐదుగురికి ఉచిత ప్రయాణం (Free travel) కల్పిస్తామని ఆర్టీసీ పేర్కొంది.


Also Read : Samantha Remuneration: 'పుష్ప'లో ఐటెం సాంగ్ కోసం రూ.1.5 కోట్లు తీసుకుంటున్న సమంత..??


ఈ మేరకు పలు డిపోలో తరఫున సోషల్ మీడియాలో పోస్టులు పోస్ట్ చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు. బుక్‌ చేసుకున్న బస్సులో అయ్యప్ప భక్తులతో (Ayyappa devotees) పాటు ఇద్దరు వంట మనుషులు, ఒక అటెండర్‌, పదేళ్లలోపు ఇద్దరు మునికంట స్వాములకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఆ‍ర్టీసీ తెలిపింది. మొత్తంగా మూడు ఫుల్‌ టిక్కెట్లు, రెండు ఆఫ్‌ టిక్కెట్లకు ఎటువంటి టికెట్ ఉండదు. 


శబరిమలై టూర్‌కి అనుగుణంగా ఆర్టీసీ (RTC) కిలోమీటర్ల వంతున ఛార్జీలు నిర్ణయించింది. వీటితో పాటు ప్రతీ గంటకు రూ.300ల వంతున వెయిటింగ్‌ ఛార్జ్‌‌ ఉంటుంది. గంటకు సగటున 30 కిలోమీటర్ల వంతున ప్రయాణ సమయాన్ని లెక్కిస్తున్నారు. ఆర్టీసీ శబరిమలై (Sabarimala) బస్సుల ఛార్జీలు ఇలా ఉన్నాయి. 36 సీట్ల సూపర్‌ లగ్జరీ బస్సులకు కిలోమీటరుకు రూ.48.96 ప్రకారం వసూలు చేస్తున్నారు. అలాగే 40 సీట్లు ఉన్న డీలక్స్‌ బస్సులకు కిలోమీటరుకు రూ.47.20 ప్రకారం వసూలు చేస్తున్నారు. 48 సీట్లు ఉన్న డీలక్స్‌ బస్సులకు కిలోమీటరుకు రూ.56.64 ప్రకారం ఛార్జ్‌ చేస్తున్నారు. 49 సీట్లు ఉన్న ఆర్టీసీ బస్సులకు కిలోమీటరుకు రూ.52.49 ప్రకారం వసూలు చేస్తున్నారు.


Also Read : Vijay Devarakonda with Mike Tyson: మైక్‌ టైసన్‌తో విజయ్‌ దేవరకొండ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook