కరోనా నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు (Telangana state Formation Day) ఏ హంగూ ఆర్భావం లేకుండా జరిగాయి. రాష్ట్ర 6వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) శాసనసభ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. తొలుత శాసనసభ ఆవరణలోని జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేసి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  మాజీ ఎమ్యెల్యే ఇంట్లో కరోనా కలకలం.. అందరికీ పాజిటివ్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ... ‘దశాబ్దాల పోరాటం, అమరవీరుల బలిదానాలు, సీఎం కేసీఆర్ మడమ తిప్పని పోరాటాల ఫలితమే ఈ తెలంగాణ రాష్ట్రం. మన దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం ఎలాగో.. రాష్ట్ర ప్రజలకు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సం అలాంటిది. తెలంగాణ శాసనసభ ఇతర రాష్ట్రాల అసెంబ్లీలకు ఆదర్శంగా నిలుస్తోంది.  గ్లామర్ డాల్ సెక్సీ ఫొటోలు వైరల్


రాష్ట్ర శాసనసభలో ప్రజాప్రయోజన అంశాలపై చర్చలు జరుపుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. వాస్తవానికి రాష్ట్ర సాధన ఎంత ముఖ్యమో, ఆ తర్వాత అభివృద్ధి కూడా అంతే ముఖ్యం. తెలంగాణ ప్రజలు కోరుకున్న దానికంటే సీఎం కేసీఆర్ ఎక్కువగా అభివృద్ధి చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. దేశంలో మరే ఇతర రాష్ట్రం చేపట్టని పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నాం. టీఆర్ఎస్ (TRS) సర్కారు ముఖ్యంగా వ్యవసాయంపై, రైతులు శ్రేయస్సు కోసం శ్రమిస్తోందని’ పేర్కొన్నారు.    


ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు, శాసనసభ కార్యదర్శి డా వి. నరసింహాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి