TS SSC Results 2023:  తెలంగాణలో టెన్త్‌ పరీక్షల రిజల్ట్స్‌ వచ్చాయి. ఈ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి రెడ్డి బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేశారు. పదో తరగతి ఫలితాల్లో 86.60 శాతం ఉత్తీర్ణత ఉత్తీర్ణత సాధించగా.. ఇందులో 88.53 శాతం మంది బాలికలు, బాలురు 84.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. పది పరీక్షల్లో 2793 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత పొందగా..25 స్కూళ్లలో సున్నా శాతం ఫలితాలను సాధించారు. ఈ ఫలితాల్లో 99 శాతంతో నిర్మల్‌ ప్రథమ స్థానంలో ఉండగా 59.46 శాతంతో వికారాబాద్‌ చివరి స్థానంలో ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..
స్టెప్ 1: ఫలితాలను చెక్‌ చేసుకోవడానికి ముందుగా వెబ్‌సైట్‌ https://bse.telangana.gov.in/ లోకి సందర్శించండి.
స్టెప్ 2: ఈ వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాగానే  "ఫలితాలు" అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. 
స్టెప్ 3: ఇలా మరో ట్యాబ్‌ కనిపిస్తుంది. అందులో "SSC ఫలితాలు 2023" ఆప్షన్‌ కనిపిస్తుంది.
స్టెప్ 4: ఇందులో మీరు మీ హాల్ టిక్కెట్ నంబర్‌ను సబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది. 
స్టెప్ 5: అందులో మీకు సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.. ఇలా చేయగానే మీకు స్క్రీన్‌పై టెన్త్ ఫలితాలు కనిపిస్తాయి.
స్టెప్ 6: ఈ రిజల్ట్స్‌ను మీరు ప్రింట్‌అవుట్ తీసుకుని భద్రపరుచుకోండి.


Also Read:  HBD Sai Pallavi : నీ చెల్లిగా పుట్టినందుకు నేను లక్కీ.. మిస్ అవుతున్నా.. సాయి పల్లవి సిస్టర్ స్పెషల్‌ విషెస్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook