TS Schools Summer Holidays 2023: స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటన.. ఎప్పటి నుంచి అంటే..?
Telangana Govt Declares Summer Holidays: తెలంగాణ విద్యార్థులకు సమ్మర్ హాలీ డేస్‌పై ప్రకటన వచ్చేసింది. ఏప్రిల్ 25 నుంచి సెలవులు ప్రారంభంకానుండగా.. 48 రోజులపాటు స్కూళ్లు బంద్ కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా..
Telangana Govt Declares Summer Holidays: తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ మేరకు ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఏప్రిల్ 25 నుంచి సెలవులు ఇస్తున్నట్లు వెల్లడించింది. అదేవిధంగా ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థుల పరీక్షల్లో కూడా మార్పులు జరిగాయి. సమ్మేటివ్ అసెస్ మెంట్ (ఎస్ఏ)-2 పరీక్షల తేదీలను మారుస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 10వ తేదీ నుంచి నుంచి ఎస్ఏ-2 పరీక్షలు జరగాల్సి ఉంది. వాటిని ఏప్రిల్ 12వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. టెన్త్ క్లాస్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 13 వరకు నిర్వహించనున్న విషయం తెలిసిందే.
ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థుల ఏప్రిల్ 12వ తేదీ నుంచి 17 వరకు.. 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థుల పరీక్షలు ఏప్రిల్ 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒంటిపూట బడులపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి రెండో వారం నుంచి రాష్ట్రంలో స్కూళ్లను ఒంటిపూట స్కూళ్లను నడపాలని ఆదేశాలు జారీ చేసింది.
ఏప్రిల్ 21న ఫలితాల వెల్లడించనున్నారు. ఏప్రిల్ 24వ తేదీన అన్ని స్కూళ్లలో పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి.. ఏప్రిల్ 25 నుంచి సెలవులు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. వేసవి సెలవులు అనంతరం జూన్ 12న తిరిగి స్కూళ్లను తెరుస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు 48 రోజుల పాటు వేసవి సెలవులు ఇస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: CM KCR: ఒక్క మాట నిరూపించండి.. రాజీనామా చేస్తా: సీఎం కేసీఆర్ సవాల్
Also Read: KL Rahul: రెండో టెస్ట్‌కు కేఎల్ రాహుల్ దూరం.. బీసీసీఐ అధికారి క్లారిటీ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook