Snow World Seized: స్నోవరల్డ్ సీజ్.. లైసెన్స్ రద్దు.. అసలు కారణం ఇదే
Snow World Seized: స్నో వరల్డ్ పేరు తెలియని వాళ్లుండరు. హైదరాబాద్‌లో వీకెండ్ వస్తే వారానికొక టూరిస్ట్ స్పాట్ వెతుక్కుని మరీ సరదాగా ఎంజాయ్ చేసే వాళ్లందరికీ లోయర్ ట్యాంక్ బండ్‌లోని స్నో వరల్డ్ సుపరిచితమే.
Snow World Seized: స్నో వరల్డ్ పేరు తెలియని వాళ్లుండరు. హైదరాబాద్‌లో వీకెండ్ వస్తే వారానికొక టూరిస్ట్ స్పాట్ వెతుక్కుని మరీ సరదాగా ఎంజాయ్ చేసే వాళ్లందరికీ లోయర్ ట్యాంక్ బండ్‌లోని స్నో వరల్డ్ సుపరిచితమే. వినోదం అందించడంతో పాటే భారీగా చార్జీలు వసూలు చేసి కస్టమర్స్ నుండి భారీ మొత్తంలో దండుకునే స్నో వరల్డ్ తాజాగా వార్తల్లో నిలిచింది. స్నో వరల్డ్‌ను తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేయడంతో పాటు స్నో వరల్డ్ లైసెన్స్ కూడా రద్దు చేశారు. తెలంగాణ పర్యాటక శాఖకు లీజు, అద్దె కింద చెల్లించాల్సిన రూ. 16. 70 కోట్ల బకాయిలు పడటంతో పర్యాటక శాఖ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
స్నో వరల్డ్ అన్ని బకాయిలు చెల్లించిన తర్వాతే తిరిగి తెరిచేందుకు అనుమతించడం జరుగుతుందని తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చి పరిస్థితి తీవ్రతను అర్థమయ్యేలా చెప్పామని.. జూలై 31వ తేదీలోగా బకాయిలు చెల్లించాలని సూచించినప్పటికీ అది జరగలేదని.. అందుకే సీజ్ చేశామని అన్నారు.
భారీ మొత్తంలో బకాయిలు పడిన వ్యవహారం స్నో వరల్డ్ ఒక్క కేసుకే పరిమితం కాలేదు. నెక్లెస్ రోడ్డులోని ఐమ్యాక్స్ థియేటర్, లోయర్ ట్యాంక్ బండ్ లోని ఎక్స్ పో టెల్ హోటల్, మాదాపూర్ ట్రైడెంట్ హోటల్, జూబిలీహిల్స్ దస్పల్లా హోటల్, నెక్లెస్ రోడ్డులోని జలవిహార్, షామీర్ పేట్ లోని గోల్ఫ్ కోర్స్ వంటి సంస్థలన్నీ ప్రభుత్వ భూముల్లో లీజు కింద పీపీపీ విధానంలో నెలకొల్పినవే. పై వ్యాపార సంస్థలన్నీ ప్రభుత్వ భూముల్లో వ్యాపారం చేసుకుంటున్నప్పటికీ.. ప్రభుత్వానికి మాత్రం ఎలాంటి లీజు చెల్లించడం లేదు. ఇదేంటని ప్రశ్నిస్తే.. ఏవో ఓ సాకులతో కోర్టుకు వెళ్లడం పరిపాటిగా మారిందని తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే స్నో వరల్డ్ పై ఇలా కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.
Also Read : Muslim Delivery Boy: ముస్లిం అయితే వద్దట..తినే తిండికి కూడా మతం రంగు ఉంటుందా ?
Also Read : Multibagger Stocks: నాలుగేళ్ల వ్యవధిలో లక్ష రూపాయల్ని 8 లక్షలు చేసిన షేర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి