Muslim Delivery Boy: తిండికి మతం ఉంటుందా..ఇప్పుడు మరోసారి ఈ ప్రశ్న వేసుకోవల్సిందే. హైదరాబాద్ నగరంలో డెలివరీ బాయ్ మతం చూసి.. ఓ స్విగ్గీ కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ తిరస్కరించాడు. ఆ వివరాలు మీ కోసం..
గతంలో ఎప్పుడూ లేని బేధాభిప్రాయాలు, మత విచక్షణ ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయింది. మొన్న జొమాటో నేడు స్విగ్గీ సంస్థలకు ఎదురైన అనుభవాలివి. ఫుడ్ డెలివరీ బాయ్ ముస్లిం అయినందున ఫుడ్ ఆర్డర్‌ను తిరస్కరించాడు స్విగ్గీ కస్టమర్. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన..మరోసారి తిండికి మతం ఉంటుందా అనే ప్రశ్నల్ని లేవనెత్తుతోంది.
ఈ సంఘటనపై తెలంగాణ రాష్ట్ర ట్యాక్సీ అండ్ డ్రైవర్స్ జేఏసీ ఛైర్మన్ షేక్ సలావుద్దీన్ స్క్రీన్‌షాట్ షేర్ చేస్తూ..స్విగ్గీ ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇలాంటి ఘటన తొలిసారేమీ కాదు. గతంలో మరో స్విగ్గీ కస్టమర్ ఇలానే ముస్లిం డెలివరీ బాయ్ ఫుడ్ తీసుకొచ్చాడనే కారణంతో ఆర్డర్ రిజెక్ట్ చేశాడు. అంతేకాకుండా..స్పైసీగా లేదు..హిందూ డెలివరీ బాయ్‌ను సెలెక్ట్ చేయండి, రేటింగ్స్ దానిపైనే ఆధారపడి ఉంటాయని ప్రస్తావించాడు.
గతంలో జొమాటోకు ఇదే అనుభవం ఎదురైంది. దీనిపై జొమాటో సీఈవో దీపేందర్ గోయెల్ గట్టి సమాధానమే ఇచ్చారు. ఇండియా అనే సమాఖ్య స్ఫూర్తికి గర్వంగా ఉందని..మా కస్టమర్లు, భాగస్వామ్యుల్లో భిన్నత్వముందని..మా విలువలకు విఘాతం కల్గించే వ్యాపారం పోయినా ఫరవాలేదని చెప్పారు. ఆకలిగా ఉన్నప్పుడు తెచ్చుకున్న తిండి తినకుండా మతం చూడటం దేనికి సంకేతమనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. ఆకలికి లేని మతం..ఆహారం తీసుకొచ్చేవాడిలో వెతకడమంటే..సమాజం పరిస్థితి ఎలా మారుతుందేననే ఆందోళన కలుగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook