TSPSC Group 1: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారి గ్రూప్-1 పరీక్షను గత ఆదివారం (అక్టోబరు 16) టీఎస్పీఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే. 503 పోస్టులకు గానూ మెుత్తం 2 లక్షల 86 వేల 51 మంది పరీక్ష రాశారు. అయితే పరీక్ష పత్రం చాలా కఠినంగా, సివిల్స్ స్థాయిలో ఉన్నాయంటూ అభ్యర్థులు ఆందోళన వెలిబుచ్చిన విషయం తెలిసిందే. అయితే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు (Group-1 Prelims 2022) సంబంధించిన కటాఫ్ మార్కులపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇన్ని మార్కులు వస్తే మెయిన్స్‌కు ఎంపిక చేస్తారంటూ కొన్ని వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఈ విషయంపై టీఎస్పీఎస్సీ (TSPSC) క్లారిటీ ఇచ్చింది. ప్రిలిమ్స్ పరీక్షలో కటాఫ్ మార్కులు ఉండవని స్పష్టం చేసింది. ప్రిలిమనరీ పరీక్ష కేవలం అభ్యర్థులను ఫిల్టర్ చేయడానికి మాత్రమే అని  టీఎస్పీఎస్సీ వెల్లడించింది. మల్టీజోన్, రిజర్వేషన్ ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మందిని మెయిన్స్ సెలెక్ట్ చేస్తామని స్పష్టతనిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష 75 శాతం మంది హాజరయ్యారు. పరీక్ష నిర్వహణకు తెలంగాణ వ్యాప్తంగా 1,019 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జామ్ కు సంబంధించిన ప్రాథమిక కీ ను ఎనిమిది రోజుల్లో విడుదల చేస్తామని కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష డిసెంబరులో జరిగే అవకాశం ఉంది. 


Also Read: TSPSC Group-1: ప్రశాంతంగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌... సివిల్స్ స్థాయిలో ప్రశ్నలు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link https://bit.ly/3P3R74U 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook