TSPSC Group 1 Prelims Result 2024 Check on  https://tspsc.gov.in/ : గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024 ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఆదివారం విడుదల చేసింది. మెయిన్స్‌కు క్వాలిఫై అయిన అభ్యర్థుల వివరాలను టీఎస్‌పీఎస్‌సీ వెల్లడించింది. అభ్యర్థులు మెరిట్ జాబితాను https://tspsc.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. గ్రూప్‌-1 పరీక్షను ఆఫ్‌లైన్‌లో నిర్వహించగా.. మూల్యాంకన ప్రక్రియకు నాలుగు వారాల సమయం పట్టింది. తాజాగా ప్రిలిమ్స్ రిజల్ట్స్‌ను ఆన్‌లైన్‌ అందుబాటులో ఉంచారు. 563 పోస్టులకు జూన్ 09న పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రిలిమ్స్‌ను క్లియర్ చేసి.. మెయిన్స్ పరీక్షకు వెళ్లడానికి అర్హత పొందిన అభ్యర్థుల రోల్ నంబర్‌లను జాబితాను రిలీజ్ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

TSPSC Group 1 Prelims Result 2024 ఇలా చెక్ చేయండి..


==> ముందుగా TSPSC అధికారిక వెబ్‌సైట్ https://tspsc.gov.in/ లోకి వెళ్లండి.
==> 'ఎగ్జామినేషన్' విభాగాన్ని ఎంచుకోండి.
==> డ్రాప్-డౌన్ మెనులో రిజల్ట్స్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
==> 'TSPSC Group 1 Prelims Result 2024' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
==> ఫలితాల పేజీ ఓపెన్ అవుతుంది. పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
==> TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024 ఫలితాలు పీడీఎఫ్‌ డాక్యుమెంట్‌ను ఓపెన్ చేయండి.
==> పీడీఎఫ్‌లో మీరు హాల్ టికెట్‌ను నంబరును సర్చ్ చేసి చూడండి.
==> మీరు క్వాలిఫై అయి ఉంటే మీ నంబరు హైలెట్ అవుతుంది.
==> నేరుగా పీడీఎఫ్‌ ఫైల్‌లోకి వెళ్లేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.