TSPSC: తెలంగాణ గ్రూప్ 2 హాల్ టికెట్స్ విడుదల ఈ లింకు ద్వారా నేరుగా డౌన్లోడ్ చేసుకోండి..
TSPSC Group 2 Hall Tickets 2024: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నేడు గ్రూప్-2 హాల్ టికెట్లను విడుదల చేసింది... అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. టిఎస్పిఎస్ కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం త్వరలోనే పరీక్ష నిర్వహించనుంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
TSPSC Group 2 Hall Tickets 2024: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 పరీక్ష డిసెంబర్ 15, 16వ తేదీల్లో రెండు షిఫ్ట్ లో ఈ పరీక్షల నిర్వహిస్తున్నారు. వివిధ సెంటర్లలో 33 జిల్లాలలో ఈ పరీక్షను నిర్వహించనున్నారు... ఈ పరీక్షలు హాజరు కావలసిన అభ్యర్థులు ముందుగా tspsc వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తరువాతే వారిని పరీక్షకు హాజరు కానిస్తారు.
నేటి నుంచి ఈ హాల్ టికెట్లు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు వారి క్రెడెన్షియల్స్ ఉపయోగించి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్సైటు ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకొని భద్రపరుచుకోవాలి... దీనికి సంబంధించిన లింకు కూడా అందుబాటులో ఉంది.
ఈ పరీక్షకు హాజరు కావలసిన అభ్యర్థులు తమ హాల్ టికెట్లతో పాటు ఫోటోను కూడా తీసుకు రావాల్సి ఉంటుంది. అంతేకాదు వారితోపాటు బ్లాక్ లేదా బ్లూ కలర్ బాల్ పాయింట్ పెన్... హాల్ టికెట్ పైన ఫోటో పేస్టు చేసి ఉండాలి. ఏదైనా ఫోటో ఐడి ఒరిజినల్ ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ ఎగ్జామినేషన్ హాల్ కు తీసుకురావాల్సి ఉంటుంది.
tspsc. gov. in అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవాలి ఈ నోటిఫికేషన్ ద్వారా 783 గ్రూప్ 2 పోస్టులను భర్తీ చేయనున్నారు... ఎంపికైన అభ్యర్థులకు మెరిట్ ఆధారంగా డాక్యుమెంట్లు వెరిఫికేషన్‌కు పిలుస్తారు. దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డులను నేడు డిసెంబర్ 9వ తేదీన విడుదల చేశారు.
ఇదీ చదవండి: చైతూ శోభితల పెళ్లి.. నా కుక్క కంటే ఏ ప్రేమ గొప్పది కాదంటూ సమంత సటైర్?
టీఎస్పీఎస్సీ గ్రూప్ టు హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి...
టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కు హాజరవుతున్న అభ్యర్థులు ఈ లింకు ద్వారా నేరుగా డౌన్లోడ్ చేసుకోవాలి.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ tspsc. gov. In అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది.
అందులో 'గ్రూప్2 సర్వీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్' పై అభ్యర్థులు క్లిక్ చేయాల్సి ఉంటుంది
ఆ తర్వాత అభ్యర్థుల లాగిన్ క్రెడిన్షియల్ ఆధారంగా హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. రెండు ప్రింట్లు తీసుకొని పెట్టుకోవాలి.
డిసెంబర్ 15, 16 తేదీల్లో రెండు షిఫ్ట్ లో ఈ పరీక్షను నిర్వహించనుంది టీఎస్పీఎస్సీ. ఉదయం 9:30 నుంచి ఫస్ట్ సెషన్ మొదలవుతుంది, ఆ తర్వాత 1: 30 నిమిషాలకు మధ్యాహ్నం రెండో సెషన్ ప్రారంభమవుతుంది. 9:30 నిమిషాల తర్వాత అన్ని పరీక్షా సెంటర్ల గేట్లు మూసివేస్తారు.. ఈ పరీక్షకు హాజరు కావలసిన అభ్యర్థులు ముందుగానే సెంటర్లకు చేరుకోవాలి.
ఇదీ చదవండి: ఆదిత్యతో ఆద్య పెళ్లి.. పెదనాన్నకు రిటర్న్ గిఫ్ట్, వెంకట్రావ్ వెకిలివేషాలు..
పేపర్ 1 డిసెంబర్ 15వ తేదీన నిర్వహిస్తారు. ఇందులో జనరల్ స్టడీస్ జనరల్ , జనరల్ ఎబిలిటీస్ ఉంటాయి. ఇక పేపర్ 2 హిస్టరీ పోలిటీ సొసైటీ డిసెంబర్ 15వ తేదీ మధ్యాహ్నం 3:00 నుంచి 5:30 నిమిషాల వరకు నిర్వహిస్తారు. ఇక పేపర్ 3 ఎకానమీ, డెవలప్మెంట్ డిసెంబర్ 16వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు నిర్వహించనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.