TSPSC extends Group 4 Notification 2023 Date: ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో వివిధ సంస్థలు వరుసగా జాబ్‌ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో తెలంగాణ ప్రభుత్వం వరుస జాబ్‌ నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) గ్రూప్‌-4 దరఖాస్తులను ఆహ్వానించింది. గ్రూప్‌-4 ఉద్యోగాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. నేటితో గడువు ముగియడంతో.. ఈ ఒక్కరోజే 34,247 దరఖాస్తులు వచ్చాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రూప్‌-4 దరఖాస్తు గడువు నేటితో ముగియనుండగా.. ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్యను టీఎస్‌పీఎస్సీ అధికారులు వెల్లడించారు. 9,168 పోస్టులకు 8,47,277 మంది అప్లై చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఆదివారం 58,845 మంది దరఖాస్తు చేసుకోగా.. సోమవారం మరో 34,247 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలియపరు. 


గ్రూప్‌-4 ఉద్యోగాలకు భారీ స్పందన రావడంతో.. సర్వర్‌పై ఒత్తిడి అనూహ్యంగా పెరిగింది. దాంతో దరఖాస్తు ఫారం పూర్తి చేశాక ఫీజు చెల్లింపులో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దరఖాస్తుల ద్వారా ప్రభుత్వం ఖాతాలో భారీగా ఖజానా చేరనుంది. గ్రూప్-4 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2022 డిసెంబర్‌ 30 నుంచి 2023 జనవరి 30వ తేదీ వరకు దరఖాస్తులకు టీఎస్‌పీఎస్సీ అవకాశం కల్పించింది. మరోసారి గడువు పొడిగింపు నిర్ణయం తీసుకుంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 9,168 పోస్టులను భర్తీ చేయనున్నది.


Also Read: SuryaKumar Yadav: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో సూర్యకుమార్ యాదవ్ భేటీ.. మ్యాటర్ ఏంటంటే?  


Also Read: SuryaKumar Yadav: ఆ విషయంలో నాదే తప్పు.. వైరల్‌గా మారిన సూర్యకుమార్ యాదవ్‌ కామెంట్స్!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.