TSRTC Offers on Bus Bookings: పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) సూపర్ గుడ్‌న్యూస్ చెప్పింది. శుభకార్యాలకు అద్దె బస్సులపై ప్రత్యేక రాయితీని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అన్ని రకాల బస్‌ సర్వీస్‌లపై 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. ఈ ఏడాది జూన్‌ 30 వరకు అద్దె బస్సులపై 10 శాతం రాయితీ అమల్లో ఉంటుందని పేర్కొంది. కార్తీక మాసం, వనభోజనాలు, శబరిమల అయ్యప్ప దర్శనం సందర్భంగా అద్దె బస్సులకు రాయితీని గతంలో సంస్థ కల్పించింది. గత ఏడాది డిసెంబర్‌ 31తో ఆ రాయితీ గడువు ముగిసింది. తాజాగా పెళ్లిళ్ల సీజన్‌ రావడంతో డిమాండ్‌ దృష్ట్యా 10 శాతం రాయితీ కల్పించాలని క్షేత్రస్థాయి అధికారులు సూచన చేశారు. ఈ మేరకు ఆ రాయితీని సంస్థ ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుభకార్యాల సమయంలో ప్రజలు ఇబ్బందులు పడొద్దనే అద్దె బస్సులపై 10 శాతం రాయితీ కల్పించినట్లు టీఎస్‌ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్‌ తెలిపారు. ప్రైవేట్‌ వాహనాల కన్నా చాలా తక్కువ ధరకే తమ సంస్థ బస్సులను అద్దెకు ఇస్తోందని వారు పేర్కొన్నారు. ముందస్తుగా ఎలాంటి నగదు డిపాజిట్‌ లేకుండానే ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నామని వివరించారు. జూన్‌ 30 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందన్నారు.




అద్దె బస్సుల బుకింగ్‌ కోసం తమ అధికారిక వెబ్‌సైట్ www.tsrtconline.in ను సందర్శించాలని సూచించారు. పూర్తి వివరాలకు స్థానిక డిపో మేనేజర్‌ను సంప్రదించాలన్నారు. శుభకార్యాలు, పెళ్లిళ్లకు తమ అద్దె బస్సులకు వినియోగించుకుని టీఎస్‌ఆర్టీసీని ప్రోత్సహించాలని కోరారు. పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో డిమాండ్‌ను బట్టి అద్దె బస్సులను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.


Also Read: Ind Vs Aus: షమీ దెబ్బకు వార్నర్ మైండ్‌బ్లాక్.. గాల్లో ఎగిరిపడ్డ స్టంప్స్  


Also Read: MLC Kavitha: రూ.10 లక్షల కోట్లు ఆవిరి.. ఈ ప్రధాని అవసరమా..?: ఎమ్మెల్సీ కవిత  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి