హైదరాబాద్‌: అన్‌లాక్ 4 మార్గదర్శకాలు ( Unlock 4 Guidelines details ) విడుదలైన నేపథ్యంలో హైదరాబాద్‌‌లో ఉద్యోగం, ఉపాధి నిమిత్తం నిత్యం వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే నగరవాసుల దృష్టి అంతా ప్రస్తుతం సిటీ బస్సులపైనే ( City buses ) ఉంది.  ఈ నెల 7 నుంచి హైదరాబాద్‌ మెట్రో రైలు సేవలు ( Hyderabad metro services ) పునఃప్రారంభం కానుండటంతో ఆర్టీసీ బస్సులకు కూడా రోడ్డెక్కేందుకు అనుమతి లభిస్తుందని ఆర్టీసీ అధికారవర్గాలు ( TSRTC ) భావించాయి. కానీ వాస్తవానికి అలా జరగలేదు. సబ్-అర్బన్ బస్సు సేవలను ప్రారంభిస్తారా లేదా అనే విషయంలో సర్కార్ నుంచి ఇంకా క్లారిటీ రాలేదు. Also read : Unlock 4 Guidelines: హైదరాబాద్ మెట్రో రైలు పట్టాలెక్కే రోజు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ( Telangana govt ) నుంచి అనుమతి లభిస్తే.. వెంటనే బస్సులను రోడ్డెక్కించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ అధికారులు, సిబ్బంది చెబుతున్నారు. ఐతే కరోనావైరస్ ( Coronavirus ) వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో సిటీ బస్సులను నడపాలా వద్దా అనే నిర్ణయం ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నందున ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయం కోసం వేచిచూడటం తప్ప తాము చేయదగినది ఏమీ లేదని ఆర్టీసీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. Also read : Pawan Kalyan birthday: ఫ్యాన్స్ తన బర్త్ డే జరుపుకోవడంపై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..


సిటీ బస్సుల్లో రద్దీని నియంత్రించడం కష్టం. అటువంటప్పుడు కొవిడ్-19 నిబంధనలు ( COVID-19 rules ) పాటించడం కూడా అంతే కష్టతరమవుతుందేమోననే ఉద్దేశంతోనే సర్కార్ సైతం సిటీ బస్సుల సేవలపై ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. Also read : పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల ఏర్పాట్లలో తీవ్ర అపశృతి.. ముగ్గురు అభిమానులు మృతి