Unlock 4 Guidelines details: హైదరాబాద్: అన్‌లాక్-4 మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం.. ఈ నెల 7 నుంచి మెట్రో రైలు సేవల ( Metro rail ) పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. పట్టణాభివృద్ధి, రైల్వే, కేంద్ర హోంశాఖలను సంప్రదించిన అనంతరం దశలవారీగా మెట్రో కార్యకలాపాలు పునరుద్ధరించుకోవచ్చునని కేంద్రం స్పష్టంచేసింది. దీంతో కేంద్రం జారీ చేసిన తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా హైదరాబాద్ మెట్రో రైలు సేవలను ( Hyderabad metro rail ) గ్రేడెడ్ పద్ధతిలో తిరిగి ప్రారంభించేందుకు తెలంగాణ సర్కారు హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్‌కు ( HMRL ) అనుమతి ఇచ్చింది. కరోనా వ్యాప్తి అనంతరం లాక్ డౌన్‌లో భాగంగా మార్చి 22న నుంచి హైదరాబాద్ మెట్రో సేవలు మూతపడి ఉన్నాయి. Also read :
Metro Rail services: సెప్టెంబర్ 7 నుంచి మెట్రో సర్వీసులు ఎలా ఉండనున్నాయి ?
హైదరాబాద్ మెట్రో రైలు సేవలను ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ( HMRL MD NVS Reddy ) ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా రైలు ప్రయాణాల వల్ల ప్రయాణికులకు కరోనా వ్యాపించకుండా చర్యలు చేపడుతున్నామని ఎన్విఎస్ రెడ్డి తెలిపారు. దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రో సర్వీస్‌గా పేరున్న హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్.. లాక్‌డౌన్‌కి ముందు వరకు నిత్యం 55 రైళ్ల ద్వారా 4.5 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించింది. Also read : Pawan Kalyan birthday: ఫ్యాన్స్ తన బర్త్ డే జరుపుకోవడంపై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..
త్వరలోనే దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రధాన నగరాలలోని మెట్రో రైలు సేవలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల మెట్రోల ఎండీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్వీఎస్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. రైళ్లలో ప్రయాణికులకు కరోనా వ్యాపించకుండా శానిటైజేషన్ ( Sanitization ), భౌతిక దూరం ( Social distancing ) కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. Also read : పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల ఏర్పాట్లలో తీవ్ర అపశృతి.. ముగ్గురు అభిమానులు మృతి