RTC Shortfilms: మీకు షార్ట్‌ఫిల్మ్స్ తీసే అభిరుచి ఉందా..అయితే చక్కని సందేశంతో కూడిన ఓ షార్ట్‌ ఫిల్మ్ తెలంగాణ ఆర్టీసీ కోసం తీస్తారా..ఎందుకనుకుంటున్నారా..లెట్స్ వాచ్ ద స్టోరీ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ..టీఎస్ఆర్టీసీను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మరో కొత్త ప్రయత్నం ప్రారంభించింది టీఎస్ఆర్టీసీ. టీఎస్ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం షార్ట్ ఫిల్మ్స్‌పై మక్కువ ఉన్న ఔత్సాహికులకు మంచి ప్రయోనకరం. ఎందుకంటే టీఎస్ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేసేలా మంచి సందేశంతో షార్ట్‌ ఫిల్మ్స్ పోటీ నిర్వహిస్తోంది టీఎస్ఆర్టీసీ. 


టీఎస్ఆర్టీసీ నిర్వహిస్తున్న ఈ షార్ట్‌ఫిల్మ్స్ కాంటెస్ట్‌లో మొదటి బహుమతికి 10 వేల రూపాయలు, రెండవ బహుమతికి 5 వేల రూపాయలు, మూడవ బహుమతికి 2.5 వేలు నగదు బహుమతిగా అందించనున్నారు. షార్ట్‌ఫిల్మ్ పోటీదారులకు కొన్ని సూచనలు కూడా జారీ చేసింది. ఏయే అంశాలు షార్ట్ ఫిల్మ్‌లో ఉండాలో సూచించింది. లీటర్ పెట్రోల్ కంటే తక్కువ ధరలో రోజంతా నగరంలో సిటీ బస్సుల్లో తిరిగే అవకాశం, శుభకార్యాలకు బుక్ చేసుకుంటే ఇంటికే బస్సు, ఆర్టీసీలో కార్గో సేవలు, గరుడ, రాజధాని బస్సుల్లో సౌకర్యాలపై షార్ట్‌ఫిల్మ్స్ తీయాలని ఆర్టీసీ సూచించింది. ఆసక్తి కలిగిన వ్యక్తులు ఈ నెల 21లోగా tsrtcshortfilm@gmail.comకు పంపించాలని టీఎస్ఆర్టీసీ వెల్లడించింది.



Also read: Pending Traffic Challans: ముగిసిన డిస్కౌంట్ ఆఫర్... ప్రభుత్వ ఖజానాకు ఎంత సొమ్ము చేరిందో తెలుసా...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook