కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి కారణంగా నిలిచిపోయిన హైదరాబాద్ సిటీ బస్సు సర్వీసులు (Hyderabad RTC Bus Services) నేడు రోడ్డెక్కాయి. లాక్‌డౌన్ సమయంలో మార్చి చివరి వారంలో రద్దయిన బస్సు సర్వీసులు దాదాపు 6 నెలల విరామం తర్వాత అందుబాటులోకి వచ్చాయి. అయితే కోవిడ్19 నిబంధనలు, కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని నగరంలోని అన్నిరూట్లలో 25% బస్సులు (City Bus services Restarted in Hyderabad) ప్రారంభించారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ హైదరాబాద్‌ (Hyderabad)లో శుక్రవారం (సెప్టెంబర్ 25) నుంచి 700 బస్సు సర్వీసులు నగరవాసులకు అందుబాటులోకి వచ్చాయి. నగరంలోని 25 శాతం బస్సులను పునరుద్ధరించేందుకు సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చారని తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు.



నగరంలోని ప్రతి డిపోకు 35 బస్సుల చొప్పున నడవనున్నాయని మంత్రి పేర్కొన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర అంతరాష్ట్ర బస్సు సర్వీసులు కూడా పునరుద్ధరించాలని సీఏం కేసీఆర్ సూచించారు. ఏపీ బస్సు సర్వీసులపై ఇంకా స్పష్టత రాలేదు. ఉన్నతస్థాయి సమావేశం తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. 


ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe