TSRTC: చిన్నారులకు ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్..టికెట్ లేకుండా రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు!
TSRTC: బాలల దినోత్సవం సందర్భంగా టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లలోపు పిల్లలకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఈరోజు ఏ బస్సులో ప్రయాణించినా టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రకటించింది.
TSRTC gift for Children: చిన్నారులకు టీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్(TSRTC Bumper Offer) ప్రకటించింది. బాలల దినోత్సవాన్ని(Children's Day) పురస్కరించుకుని.. ఇవాళ 15 ఏళ్లలోపు పిల్లలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది.
టీఎస్ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్(Sajjanar) బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలతో ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకెళ్లారు ఎండీ సజ్జనార్. అయితే… చిల్ట్రన్స్ డే సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పిల్లలలకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు.
Also read: Telangana : తెలంగాణకు 12 స్వచ్ఛ అవార్డులు రావడంపై మంత్రి కేటీఆర్ హర్షం
15 సంవత్సరాల కంటే… తక్కువ వయసున్న పిల్లలకు బస్సుల్లో టికెట్ లేకుండా ప్రయాణించవచ్చని ప్రకటించారు. తెలంగాణ(Telangana) రాష్ట్ర వ్యాప్తంగా…ఎక్కడి నుంచి ఎక్కడికైనా.. ఉచితంగా వెళ్లవచ్చని తెలిపారు. ఏసీ, మెట్రో డీలక్స్, ఆర్టీనరీ ఇలా ఏ బస్సు అయినా…ఎక్కవచ్చన్నారు. సురక్షితమైన… సుఖ వంతమైన ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఇక ఎండీ సజ్జనార్ తీసుకున్న ఈ నిర్ణయంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లిళ్లకు బస్సులు బుక్ చేసుకున్న నూతన జంటలకు గిప్ట్ లు ఇస్తామని ఇటీవల ఆర్టీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook