Telangana : తెలంగాణ‌కు 12 స్వ‌చ్ఛ అవార్డులు రావడంపై మంత్రి కేటీఆర్ హ‌ర్షం

Telangana secures 12 awards in sanitation: కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో రాష్ట్రాల క్యాటగిరీలో తెలంగాణకు 12 అవార్డులు (12 awards) రావడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ (KTR) పలు అంశాంలపై మాట్లాడారు. గ‌త ఏడున్న‌ర ఏళ్లుగా తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందన్నారు. వి

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 13, 2021, 04:50 PM IST
  • స్వచ్ఛ భారత్‌ మిషన్‌లోని పలు విభాగాల్లో తెలంగాణ దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా నిలవడంపై కేటీఆర్ హ‌ర్షం
  • తెలంగాణకు 12 అవార్డులు రావడంపై సంతోషం వ్యక్తం చేసిన మంత్రి
  • ఈ నెల‌ 20న విజ్ఞాన భ‌వ‌న్‌లో రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా అవార్డుల ప్రదానం
Telangana : తెలంగాణ‌కు 12 స్వ‌చ్ఛ అవార్డులు రావడంపై మంత్రి కేటీఆర్ హ‌ర్షం

Telangana secures 12 awards in sanitation, waste management: స్వచ్ఛ భారత్‌ మిషన్‌లోని పలు విభాగాల్లో తెలంగాణ దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా నిలవడంపై తెలంగాణ ప‌ట్ట‌ణాభివృద్ధి, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. అలాగే కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో రాష్ట్రాల క్యాటగిరీలో తెలంగాణకు 12 అవార్డులు (12 awards) రావడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ (KTR) పలు అంశాంలపై మాట్లాడారు. గ‌త ఏడున్న‌ర ఏళ్లుగా తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందన్నారు. వివిధ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తూ అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుందని చెప్పారు. ప‌ట్ట‌ణాలు అభివృద్ధి చెందాల‌నే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ (CM KCR) ప‌ట్ట‌ణాభివృద్ధిలో స‌మూల‌మైన మార్పులు తీసుకువ‌చ్చారని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. మున్సిపాలిటీల సంఖ్యను 68 నుంచి 142కు పెంచామని గుర్తు చేశారు.

దేశంలో ఎక్క‌డా లేని విధంగా చ‌ట్టంలోనే గ్రీన్ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టి.. హ‌రిత ప‌ట్ట‌ణాల‌ను త‌యారు చేసేందుకు కృషి చేస్తున్నామని కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. టీఎస్ బీపాస్ చ‌ట్టాన్ని అమ‌లు చేశాం అని మంత్రి తెలిపారు. ఇప్ప‌టి దాకా తీసుకొచ్చిన చ‌ట్టాల‌న్నీ పౌరుడి కేంద్రంగా తీసుకువ‌చ్చాం అని కేటీఆర్ పేర్కొన్నారు. దీంతో చాలా ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని చెప్పారు.

Also Read :Ooriki Uttharana Trailer : ప్రభుత్వ పథకాలకు అర్హత లేనోడివి పెళ్లి చూపులకు ఎందుకొచ్చావ్​?

తెలంగాణ ప్రభుత్వ కార్య‌క్ర‌మాల‌కు వివిధ సంద‌ర్భాల్లో కేంద్రం గుర్తింపు ఇచ్చిందని గుర్తు చేశారు. తాజాగా శానిటేష‌న్ ఛాలెంజ్‌లో (Sanitation Challenge) భాగంగా 4300 న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాలు పోటీ ప‌డితే తెలంగాణ‌కు 12 పైచిలుకు అవార్డులు వ‌చ్చాయని.. ఈ అవార్డులు రావడాన్ని ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తికి ల‌భించిన గుర్తింపుగా భావిస్తున్నామని కేటీఆర్ (KTR) పేర్కొన్నారు.

ఈ నెల‌ 20న విజ్ఞాన భ‌వ‌న్‌లో రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా ఈ అవార్డులు అందుకోబోతున్నామని చెప్పారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వానికి, అధికారుల‌కు గ‌ర్వ‌కార‌ణమని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రాల క్యాట‌గిరీలోనూ స‌ఫాయి మిత్ర సుర‌క్ష చాలెంజ్ అవార్డు జాతీయ స్థాయిలో మాత్ర‌మే కాకుండా రాష్ట్రాల‌ క్యాట‌గిరీలోనూ స‌ఫాయి మిత్ర సుర‌క్ష చాలెంజ్‌లో అవార్డు సాధించాం అని కేటీఆర్ తెలిపారు. తెలంగాణకు (Telangana) మొత్తం 12 అవార్డులు రావ‌డం సంతోషంగా ఉంద‌ని కేటీఆర్ (KTR) స్ప‌ష్టం చేశారు.

Also Read : Delhi Lockdown News: ఢిల్లీలో పెరిగిపోతున్న ఎయిర్ పొల్యూషన్.. లాక్ డౌన్ తప్పదా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News