Sajjanar Car Accident: ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కారు.. పలువురికి గాయాలు
Sajjanar Car Accident: అంతర్గాం మండవం పెద్దంపేట ధర్మారం క్రాస్ రోడ్డు వద్ద సజ్జనార్ ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న పలువురికి గాయలయ్యాయి. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కుడి చేతి వేలుకు గాయమైంది.
Sajjanar Car Accident: సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారు పెద్దపల్లి జిల్లాలో ఆటోను ఢీకొట్టింది. అంతర్గాం మండవం పెద్దంపేట ధర్మారం క్రాస్ రోడ్డు వద్ద సజ్జనార్ ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. పెద్దంపేట నుండి పాలకుర్తి మండలం పుట్నూర్ కు ప్రయాణికులు ఆటోలో వెళుతున్నారు. అయితే రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో హైదరాబాద్ నుండి మహారాష్ట్రకు వెళ్తున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కారు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న పలువురికి గాయలయ్యాయి. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కుడి చేతి వేలుకు గాయమైంది. సమాచారం అందుకున్న బసంత్ నగర్ ఎస్ఐ శివానీరెడ్డి గాయాలైన వారిని టోల్ గేట్ హైవే అంబులెన్స్ లో హుటాహుటిన పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అనంతరం క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. రామగుండం మండలం మల్యాలపల్లి గ్రామానికి చెందిన నాగరాజు, లక్ష్మికి తీవ్ర గాయాలు కాగా అంతర్గాం మండలం రాయబండి గ్రామానికి చెందిన నూనె భూమయ్య, నూనె లక్ష్మికి గాయాలయ్యాయని పోలీసులు చెప్పారు.
Read also: FOOTBALL FANS FIGHT: రక్తపాతంగా మారిన ఫ్యాన్స్ ఫైట్.. 129 మందిని బలి తీసుకున్న ఫుట్ బాల్ మ్యాచ్
Read also: Uttar Pradesh Accident: ఘోర ప్రమాదం.. ట్రాక్టర్ కుంటలో పడి 22 మంది మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి