Uttar Pradesh Tractor Accident: ఉత్తర్ ప్రదేశ్‌లో శనివారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాన్పూర్ జిల్లా ఘటంపూర్ సమీపంలో ఓ ట్రాక్టర్ ట్రాలీ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న నీటి గుంటలో పడిపోయింది. ట్రాక్టర్ ట్రాలీలో 50 మందికిపైగా ప్రయాణికులు ఉండగా.. ఈ ప్రమాదంలో 22 మంది చనిపోయారు. మృతులలో మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నారు. పదుల సంఖ్యలో జనం గాయపడినట్టు ప్రాథమిక సమాచారం అందుతోంది. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను సమీపంలోని ఆస్పతికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉన్నావ్ సమీపంలోని చంద్రికా దేవి ఆలయానికి వెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
Uttar Pradesh | Over two dozen people injured after a tractor trolley carrying pilgrims returning from Unnao met with an accident as it overturned in Ghatampur area in Kanpur district. Police on the spot pic.twitter.com/AKCY9rxRWH
— ANI (@ANI) October 1, 2022
తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
చెరువులో ట్రాక్టర్ ట్రాలి బోల్తా పడి 22 మంది దుర్మరణం పాలైన ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం ప్రకటించిన సీఎం యోగి ఆదిత్యనాథ్.. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాల్లో ఎలాంటి ఆటంకం లేకుండా చూడాల్సిందిగా యూపీ సీఎం అధికారులను ఆదేశించారు.
Also Read : Lal Bahadur Shastri Jayanti 2022: లాల్ బహదూర్ శాస్త్రి జయంతి.. శాస్త్రి గురించి చాలామందికి తెలియని నిజాలు
Also Read : Gandhi Jayanti 2022: గాంధీ జయంతి చరిత్ర, ప్రాముఖ్యత, ప్రపంచ అహింసా దినోత్సవం నేపథ్యం
Also Read : Lal Bahadur Shastri Jayanti 2022: లాల్ బహదూర్ శాస్త్రి జయంతి.. ఇండో-పాక్ వార్ హీరోకి నివాళి అర్పిస్తూ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి