TSRTC MD Sajjanar Responds on Passenger Tweet And reduced Bus fares: ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ నష్టాల్లో ఉంది. ఇలాంటి పరిస్థితిలో ప్రతి రూపాయి ఆర్టీసీకి కీలకమే. అయితే ఒక ప్యాసింజర్ (Passenger) చేసిన ట్వీట్‌ కు స్పందించిన ఆర్టీసీ.. గతంలో రౌండ్‌ ఆఫ్‌ పేరిట పెంచిన అదనపు వసూళ్లను తగ్గించింది. తాజాగా ఓ ప్యాసింజర్ బెంగుళూరు బస్సు ఎక్కాడు. అయితే టికెట్‌ రేట్ (Ticket rate) చేసి ఆశ్చర్చపోయాడు. టికెట్‌ అసలు ధర రూ.841 అయితే చెల్లించాల్సిన మొత్తం రూ.850 అని ఉండటంతో కండక్టర్‌ను ఆరా తీశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలు ధరను మించి రూ.9 అధికంగా ఎందుకు వసూలు చేస్తారని అడిగాడు. ఆ మొత్తం ఎటు పోతోందని ప్రశ్నించాడు. ఇదే విషయాన్ని ట్విటర్‌లో (Twitter) పోస్టు చేశాడు అతను. ఈ విషయం ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ (Sajjanar) వరకు వెళ్లింది. 


అయితే కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్‌‌కు ఈ విషయంపై స్పష్టత లేక అధికారులను అడిగారు. టికెట్‌ ధరలు మార్చినప్పుడు చిల్లర సమస్య రాకుండా రౌండ్‌ ఆఫ్‌ చేసే విధానం ఉందని.. దాని ప్రకారమే ఆ 9 రూపాయలు వసూలు చేస్తున్నామని సజ్జనార్‌‌కు (Sajjanar) వివరించారు. 


Also Read : Vamika Rape Threat: కోహ్లీ కూతురును రేప్ చేస్తానని బెదిరించిన తెలుగు యువకుడు అరెస్ట్


అయితే ఇలా అదనంగా వసూలు చేయటం వల్ల ఆర్టీసీ ప్రతిష్ట తగ్గుతుందని భావించిన సజ్జనార్.. వెంటనే రేట్లను సవరించాలని ఆదేశించారు. ఈ మేరకు అధికారులు.. ఎక్స్‌ప్రెస్, ఆపై కేటగిరీ బస్సుల్లో రౌండ్‌ ఆఫ్‌ ధరను సవరించారు. గతంలో రూ.841 నుంచి రూ.850కి పెంచిన బెంగుళూరు టికెట్‌ ధరను.. ఇప్పుడు రూ.840కి మార్చారు. అలాగే ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో కనీస చార్జీ రూ.15, దీనికి సెస్‌ రూపాయి కలిపితే రూ.16 అవుతుంది. దీనిని చిల్లర ఇబ్బందిపేరిట రూ.20గా రౌండ్‌ ఆఫ్‌ చేసి వసూలు చేశారు. ఇప్పుడు దాన్ని కూడా రూ.15కు తగ్గించారు. ఇలా అన్ని రకాలుగా టికెట్ రేట్లలో (Ticket rates) మార్పులు చేశారు. దీంతో రోజూ సగటున రూ.10 లక్షల వరకు టికెట్లపై తెలంగాణ (Telangana) ఆర్టీసీ (RTC) ఆదాయం తగ్గనుంది.


Also Read : Kidnap Drama: గర్ల్ ఫ్రెండ్ ఖర్చుల కోసం కిడ్నాప్ డ్రామా.. అడ్డంగా బుక్కైన యువకుడు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి