Kidnap Drama: గర్ల్ ఫ్రెండ్ ఖర్చుల కోసం కిడ్నాప్ డ్రామా.. అడ్డంగా బుక్కైన యువకుడు

Kidnap Drama: ప్రియురాలి ఖర్చులు భరించేందుకు కొంత డబ్బు అవసరమని భావించిన ఓ యువకుడు కిడ్నాప్ డ్రామా ఆడాడు. కిడ్నాపర్‌లా గొంతమార్చి మాట్లాడుతూ తల్లిదండ్రులను నమ్మించి.. రూ.2.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువకుడి భాగోతాన్ని బయటపెట్టారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 11, 2021, 03:07 PM IST
Kidnap Drama: గర్ల్ ఫ్రెండ్ ఖర్చుల కోసం కిడ్నాప్ డ్రామా.. అడ్డంగా బుక్కైన యువకుడు

Kidnap Drama: ప్రియురాలి ఖర్చుల కోసం.. ఓ యువకుడు ప్లాన్ వేశాడు. కిడ్నాప్ డ్రామాలాడి.. తల్లిదండ్రులకు రూ.2.5 లక్షలు డిమాండ్ చేశారు. పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ షాకింగ్ సంఘటన భింద్ జిల్లాలోని గోహద్ పట్టణంలో వెలుగులోకి వచ్చింది. 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తన లవర్ ఖర్చుల కోసం కిడ్నాప్ డ్రామా అల్లుకున్నాడని పోలీసులు బుధవారం తెలిపారు. వాయిస్ మార్చే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని.. కొడుకును కిడ్నాప్ చేశామంటూ తన తండ్రికి రూ.2.5 లక్షలు డిమాండ్ చేశాడని తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోహద్‌కు చెందిన సురేంద్ర కుష్వాహా కుమారుడు సందీప్ కుష్వా (18) నవంబర్ 6వ తేదీన కనిపించకుండా పోయాడు. కుమారుడి ఆచూకీ లభించకపోవడంతో.. సురేంద్ర కుష్వాహా స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తనకు కుమారుడి మొబైల్ నుంచి 8న ఫోన్ రావడం వల్ల సురేంద్ర మళ్లీ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు మొబైల్ సిగ్నల్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఫోన్ వచ్చిన లొకేషన్ ఆధారంగా గ్వాలియర్‌లోని ఓ ప్రాంతంలో దాడులు నిర్వహించి సందీప్‌ను పోలీసులు సురక్షితంగా పట్టుకున్నారు.

సందీప్‌ను అదుపులోకి తీసుకున్న అనంతరం పోలీసులు విచారించగా.. అతను చెప్పె విషయాలు విని షాకయ్యారు. తన లవర్‌ని కలవడానికి గురుగ్రామ్ వెళ్లాలనుకున్నానని.. అందుకు డబ్బులు కావాల్సి ఉందని తెలిపారు. అందుకే కిడ్నాప్ డ్రామా ఆడినట్లు యువకుడు వెల్లడించాడు. దీంతో యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని గోహద్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ గోపాల్ సింగ్ సికర్వార్ తెలిపారు. ముందు డబ్బులు అడిగితే.. కుటుంబసభ్యులు ఇవ్వలేదని దీంతో ఈ ప్లాన్ రచించినట్లు తెలిపారు. 

Also Read: Man kills wife : టవల్ ఆలస్యంగా ఇచ్చిందని భార్యనే చంపిన భర్త 

Also Read: Gold Smuggling: శానిటరీ ప్యాడ్స్ లో గోల్డ్ స్మగ్లింగ్.. ఎయిర్ ఇండియా ఎంప్లాయ్ అరెస్టు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News