తెలంగాణలో ఎట్టకేలకు ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. దాదాపు 2 నెలల అనంతరం రాష్ట్రంలో ఆర్టీసీ సర్వీసులు మళ్లీ మొదలయ్యాయి. హైదరాబాద్ నగరం మినహా రాష్ట్ర వ్యాప్తంగా నేటి ఉదయం 6 గంటల నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. అంతర్రాష్ట్ర సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీకి అనుమతి లభించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు నేటి నుంచి ఆర్టీసీ బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు నడవనున్నాయి. నా విన్నపాన్ని మన్నించండి: ఫ్యాన్స్‌ను కోరిన NTR


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆర్టీసీ సిబ్బంది కరోనా నివారణకు శానిటైజేషన్ పనులు చేస్తూనే విధులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో అనుమతి లేనందున నగరానికి వచ్చే బస్సులను జేబీఎస్ వరకే అనుమతిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు ఎంజీబీఎస్ వైపు వచ్చే బస్సులను ఎల్బీనగర్ వరకు అనుమతించడం లేదని, హయత్ నగర్‌ వద్ద చివరి స్టాప్ అని తెలిపారు. బంగారం భగభగలు.. షాకిచ్చిన వెండి ధరలు


సోషల్ డిస్టాన్సింగ్ (భౌతిక దూరం) పాటించేలా నిబంధన అమలు చేయాలన్న ఆర్టీసీ ప్రతిపాదనకు మంత్రివర్గం నో చెప్పింది. సీట్లలో భౌతిక దూరం పాటిస్తే టికెట్ల ధరలు పెంచాల్సి ఉంటుందని, ప్రజలకు ఇదివరకే దీనిపై అవగాహన ఉందని కేబినెట్ అభిప్రాయపడింది. దీంతో ప్రజలపై టికెట్ ఛార్జీల భారం లేకుండానే తెలంగాణలో ఆర్టీసీ బస్సులు రయ్ రయ్ మంటూ మళ్లీ సేవల్ని పునరుద్ధరించాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్
Bikiniలో అమెరికన్ అందం హాట్ పోజులు