Bhadrachalam Sita Rama Kalyanotsava Talambralu: భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలకు భక్తుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. కేవలం పది రోజుల్లోనే 50 వేల మంది భక్తులు తలంబ్రాల కోసం బుకింగ్‌ చేసుకున్నారు. రోజుకు సగటున 5 వేల వరకు బుకింగ్‌లు అవుతున్నాయి. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) నిర్ణయించిన విషయం తెలిసిందే. రూ.116 చెల్లించి బుక్‌ చేసుకుంటే కల్యాణ అనంతరం తలంబ్రాలను భక్తులకు హోమ్ డెలివరీ చేయనుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తలంబ్రాల బుకింగ్‌ జరుగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భక్తులకు మరో అవకాశాన్ని కల్పించింది టీఎస్‌ఆర్టీసీ. శ్రీరామ నవమి కల్యాణ సమయంలోనే కాకుండా.. తలంబ్రాలను ఎప్పుడైనా భక్తులు పొందే సదావకాశాన్ని కల్పించింది. కార్గో పార్శిల్‌ సెంటర్‌కు వెళ్లి రూ.116 చెల్లిస్తే నిర్ణీత సమయంలో తలంబ్రాలను భక్తులకు అందించనుంది. 


'భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాలకు భక్తుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఒక్క తెలంగాణ నుంచే కాకుండా విదేశాల నుంచి బుకింగ్‌లు వస్తున్నాయి. దుబాయ్‌, అమెరికా, తదితర దేశాల నుంచి కాల్‌ చేసి తలంబ్రాలు కావాలని అడుగుతున్నారు. కేవలం 10 రోజుల్లోనే 50 వేల బుకింగ్‌లు వచ్చాయి. నియమ నిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో ఉపయోగిస్తున్నారు. విశిష్టమైన ఆ తలంబ్రాలను భక్తులు పొందేందుకు ఆసక్తి చూపిస్తున్నారు..' అని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు. 


రాష్ట్రంలోని అన్ని టీఎస్‌ఆర్టీసీ కార్గో పార్శిల్‌ కౌంటర్లలో తలంబ్రాలను బుక్‌ చేసుకోవచ్చని వారు సూచించారు. స్వామి వారి తలంబ్రాలు కావాలనుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్‌ విభాగ ఫోన్‌ నంబర్లు 9177683134, 7382924900, 9154680020ను సంప్రదించాలని చెప్పారు. తమ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లు భక్తుల వద్ద కూడా ఆర్డర్‌ను స్వీకరిస్తారని పేర్కొన్నారు.


Also Read: Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్‌కు కూడా చేరదు.. మాజీ క్రికెటర్ జోస్యం


Also Read: Old Pension Scheme: ఓపీఎస్ కోసం తెలంగాణ ఉద్యోగులు పోరాటం.. ఆందోళనలకు పిలుపు  


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి