Aakash Chopra On DC: ఐపీఎల్ 2023 ప్రారంభానికి క్రికెట్ అభిమానులు ఎంతోగానో ఎదురుచూస్తున్నారు. మార్చి 31న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య పోరుతో టైటిల్ వేట ప్రారంభం కానుంది. మూడేళ్ల తరవాత అన్ని జట్లు సొంత మైదానంలో మ్యాచ్‌లు ఆడుతుండడంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. తమ అభిమాన జట్ల మ్యాచ్‌లను నేరుగా స్టేడియానికి వెళ్లి వీక్షించనున్నారు. మరోవైపు ఏ జట్టు ఫైనల్‌కు వెళుతుంది..? ఏ జట్టు బాగా పర్ఫామ్ చేస్తుంది..? అంటూ అప్పుడే అంచనాలు మొదలుపెట్టేశారు మాజీలు. టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా నిత్యం ఏదో ఒక జట్టు గురించి అంచనా వేస్తున్నాడు.
తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు గురించి మాట్లాడాడు. ఢిల్లీ టీమ్ ఈసారి ప్లే ఆఫ్స్‌కు చేరడం కష్టమేనని జోస్యం చెప్పాడు. జట్టులో ఆటగాళ్లకు ఎవరి పాత్ర ఏంటో ఇంకా స్పష్టంగా తెలియదని.. తొలి టైటిల్ కోసం నిరీక్షణ తప్పదని అన్నాడు. గతేడాది ఢిల్లీ ప్లేఆఫ్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. 14 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు, ఏడు ఓటములతో ఐదో స్థానంలో నిలిచింది.
ఢిల్లీ జట్టు ప్లేయింగ్ ఎలెవన్ గురించి ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. డేవిడ్ వార్నర్, పృథ్వీ షాలతో ఢిల్లీ జట్టు ఓపెనింగ్ చేయనుందన్నాడు. మిచెల్ మార్ష్ 3వ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడని.. రిషబ్ పంత్ లేకపోవడంతో మనీష్ పాండే 4వ నంబర్‌లో ఆడగలడని చెప్పాడు. 5వ స్థానంలో రూసో, పావెల్‌లలో ఇద్దరిలో ఒకరు బరిలోకి దిగుతారని అన్నాడు. సర్ఫరాజ్ ఖాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ఆరోస్థానంలో ఆడే అవకాశం ఉందన్నాడు. అయితే జట్టుకు ఎవరు కీపింగ్ చేస్తారనేది ఇంకా తెలియరాలేదని.. తాను సర్ఫరాజ్ అనుకుంటున్నానని పేర్కొన్నాడు. అక్షర్ పటేల్ 7వ స్థానంలో ఆడగలడని చెప్పాడు.
బౌలింగ్ విషయానికి వస్తే.. నలుగురు బౌలర్లలో ముగ్గురు పేస్ బౌలర్, ఓ స్పిన్నర్‌ను తీసుకునే అవకాశం ఉందన్నాడు ఆకాశ్ చోప్రా. కుల్దీప్ యాదవ్ స్పిన్నర్‌గా.. శార్దుల్ ఠాకూర్, నోకియా, చేతన్ సకారియా, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మలో పేస్ బౌలర్లను ఎంచుకోవచ్చని అంచనా వేశాడు. ఢిల్లీ జట్టు ఏప్రిల్ 1న లక్నో సూపర్ జెయింట్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తన మొదటి మ్యాచ్ ఆడుతుంది.
Also Read: YSRCP: వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. సీఎం జగన్ సీరియస్.. సజ్జలకు చెక్..?
Also Read: IPL 2023: రూమ్ పాస్‌వర్డ్ మర్చిపోయిన సూర్యకుమార్ యాదవ్.. బాలీవుడ్ డైలాగ్స్‌తో సెట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి