3,025 ఖాళీల భర్తీకి TSSPDCL నోటిఫికేషన్స్
3025 ఖాళీల భర్తీకి TSSPDCL నోటిఫికేషన్స్
హైదరాబాద్: జూనియర్ లైన్‌మెన్, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టులు అన్నీ కలిపి మొత్తం 3,025 ఖాళీలను భర్తీ చేసేందుకు తెలంగాణలోని విద్యుత్తు సంస్థ టీఎస్ఎస్‌పీడీసీఎల్ వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీచేసింది. 10వ తరగతి, ఐటీఐ, డిగ్రీ పూర్తిచేసిన వారు తమ అర్హతలకు తగిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కొద్ది రోజుల క్రితమే ఈ ఉద్యోగాల భర్తీపై ప్రకటన వెలువడగా తాజాగా వాటిపై వేర్వేరు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. జూనియర్ పర్సనల్ ఆఫీసర్(జేపీఓ), జూనియర్ లైన్‌మెన్ (జేఎల్ఎం) పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 22 న, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు ఈ నెల 31న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానున్నాయి.
ఉద్యోగాల వారీగా ఖాళీలు, దరఖాస్తు ప్రారంభ తేదీ, చివరి గడువు, ఫీజు చెల్లింపు తేదీలు, హాల్ టికెట్ డౌన్‌లోడ్ తేదీల వివరాలు
జూనియర్ లైన్‌మెన్ - 2,500
జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ - 500
జూనియర్ పర్సనల్ ఆఫీసర్ - 25
మొత్తం ఖాళీలు - 3,025
జేపీఓ, జేఎల్ఎం పోస్టులకు ఫీజు పేమెంట్ ప్రారంభ తేదీ - అక్టోబర్ 21
జేపీఓ, జేఎల్ఎం పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ - అక్టోబర్ 22
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ - నవంబర్ 10, సాయంత్రం 5 గంటలు
దరఖాస్తులకు చివరి తేదీ - నవంబర్ 10
హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ - డిసెంబర్ 5
పరీక్ష తేదీ - డిసెంబర్ 15
జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు ఫీజు పేమెంట్ ప్రారంభ తేదీ - అక్టోబర్ 30
జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - అక్టోబర్ 31
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ - నవంబర్ 20 సాయంత్రం 5 గంటలు
దరఖాస్తులు సబ్మిట్ చేయడానికి చివరి తేదీ - నవంబర్ 20
హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ - డిసెంబర్ 11
పరీక్ష తేదీ - డిసెంబర్ 22
జూనియర్ లైన్‌మెన్ అర్హతలు 10వ తరగతి, ఎలక్ట్రికల్ ట్రేడ్ / వైర్‌మెన్ ట్రేడ్‌లో ఐటీఐ లేదా ఇంటర్మీడియట్‌లో ఎలక్ట్రికల్
ఒకేషనల్ కోర్స్.
జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ అర్హతలు గ్రాడ్యుయేషన్
జూనియర్ పర్సనల్ ఆఫీసర్ అర్హతలు బీఏ, బీకామ్, బీఎస్సీలో ఫస్ట్ క్లాస్ డిగ్రీ
వయస్సు - జూనియర్ లైన్‌మెన్ పోస్టులకు 18 నుంచి 35 ఏళ్లు, జూనియర్ పర్సనల్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు 18 నుంచి 34 ఏళ్లు.
ఫీజు - అప్లికేషన్‌కు రూ.100, పరీక్షకు రూ.120.