Rahul Meet Tv9 Ravi Prakash: రాహుల్ గాంధీతో రవి ప్రకాష్ భేటీ.. కేసీఆర్ వ్యతిరేకులను ఏకం చేస్తున్న రేవంత్..?
Rahul Meet TV9 Ravi Prakash: రాహుల్ గాంధీ పర్యటనతో తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ కనిపిస్తోంది. రాహుల్ పర్యటనలో అంతా తానే వ్యవరించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. సీఎం కేసీఆర్ టార్గెట్ గా తనదైన శైలిలో వ్యూహాలు రచించారు. కేసీఆర్ వ్యతిరేక శక్తులను ఏకం చేసేందుకు రాహుల్ టూర్ ను రేవంత్ రెడ్డి ఉపయోగించుకున్నారు.
Rahul Meet TV9 Ravi Prakash: రాహుల్ గాంధీ పర్యటనతో తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ కనిపిస్తోంది. వరంగల్ సభతో పాటు శనివారం హైదరాబాద్ లో కీలక సమావేశాలు నిర్వహించారు రాహుల్ గాంధీ. తమ అగ్రనేత పర్యటనకు భారీగా ఏర్పాట్లు చేసింది పీసీసీ. ఇక రాహుల్ పర్యటనలో అంతా తానే వ్యవరించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. సీఎం కేసీఆర్ టార్గెట్ గా తనదైన శైలిలో వ్యూహాలు రచించారు. కేసీఆర్ వ్యతిరేక శక్తులను ఏకం చేసేందుకు రాహుల్ టూర్ ను రేవంత్ రెడ్డి ఉపయోగించుకున్నారు. తెలంగాణ ఉద్యమకారులతో పాటు కొంత కాలంగా కేసీఆర్ వైఖరిపై అసంతృప్తిగా ఉన్న నేతలను తనవైపు తిప్పుకున్నారనే టాక్ వస్తోంది. తెలంగాణలో మేధావి వర్గం చెప్పుకునే నేతలంతా కేసీఆర్ కు వ్యతిరేకంగా సాగేలా చేయడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది.
శనివారం తాజ్ కృష్ణాలో తెలంగాణ ఉద్యమకారులతో సమావేశమయ్యారు రాహుల్ గాంధీ. ఉద్యమకారులతో పాటు మేధావులు, జర్నలిస్టులను రాహుల్ తో సమావేశపరిచారు రేవంత్ రెడ్డి. ప్రజా యుద్ధనౌకగా పిలుచుకునే గద్దర్ తో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన కళాకారులు, రచయితలు, ప్రోఫెసర్లను రాహుల్ దగ్గరకు తీసుకెళ్లారు. అంతేకాదు తెలుగు మీడియాకు సంబంధించిన ఎడిటర్లు , సీనియర్ జర్నలిస్టులతో రాహుల్ గాంధీ సమావేశం ఏర్పాటు చేశారు రేవంత్ రెడ్డి. రాహుల్ భేటీకి కేసీఆర్ బాధితుడిగా చెప్పుకునే టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్ కూడా హాజరయ్యారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా వార్తలు రాయడంలో ముందుండే ఏబీఎన్ రాధాకృష్ణ కూడా రాహుల్ తో చర్చించారు. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
కేసీఆర్ వల్లే తనను టీవీ9 నుంచి వెళ్లగొట్టారనే కసితో రవి ప్రకాష్ ఉన్నారనే టాక్ ఉంది. తెలంగాణలో ఆయనపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందని రవి ప్రకాష్ పలుసార్లు ప్రకటించారు. తనపై నమోదైన కేసుల విషయంలో కోర్టులకు వెళ్లి ఆయన విచారణ జరగకుండా స్టే తెచ్చుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్న రవి ప్రకాష్.. కొంత కాలంగా కేసీఆర్ వ్యతిరేక శక్తులకు రవి ప్రకాష్ సహకరిస్తున్నారనే ప్రచారం ఉంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి రాజకీయంగా రవి ప్రకాష్ సలహాలు, సూచనలు ఇస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీతో రవి ప్రకాష్ సమావేశం కావడం ఆసక్తిగా మారింది. రేవంత్ రెడ్డి స్వయంగా రవి ప్రకాష్ ను రాహుల్ దగ్గరకు తీసుకెళ్లారని తెలుస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ ను ఓడించాలంటే ఏం చేయాలన్న కార్యాచరణపై రవి ప్రకాష్ తో రాహుల్ , రేవంత్ చర్చించారని చెబుతున్నారు. మొత్తంగా రాహుల్ గాంధీతో మీడియా బాస్ రవి ప్రకాష్ చర్చలు జరపడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ గా మారింది. రేవంత్ రెడ్డి వ్యూహరచనపై కాంగ్రెస్ వర్గాలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే దూకుడుతో వెళితే కేసీఆర్ కు చెమటలు పట్టడం ఖాయమంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.
Also Read: Rahul Gandhi On Kcr: కేసీఆర్ పేరు ఉచ్చరించని రాహుల్.. అసహ్యమా!వ్యూహమా?
Also Read: Karnataka: కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి 2 వేల 5 వందల కోట్లు..అసలేం జరిగింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook