Two infants died in Niloufer: హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో విషాదం చోటు చేసుకుంది. ఇంజెక్షన్ వికటించి ఇద్దరు శిశువులు మృతి చెందారు. నర్సు తప్పుడు ఇంజెక్షన్ ఇవ్వడం వల్లే శిశువులు మృతి చెందినట్లు వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చిన్నారుల మృతికి నిరసనగా ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీ కృష్ణ మాట్లాడుతూ.. ఒక శిశువు మాత్రమే చనిపోయినట్లు తెలిపారు. డైస్ప్లా సియా సిండ్రోమ్‌తో బాధపడుతోన్న ఆ శిశువు ఫిబ్రవరి 28న ఆసుపత్రిలో చేరినట్లు చెప్పారు. ఆ శిశువు 7 నెలలో జన్మించడంతో కేవలం కిలో బరువు మాత్రమే ఉందన్నారు. శిశువుకు ఆక్సిజన్ అందిస్తూ వచ్చామని.. ఆరోగ్యం మరింత క్షీణించడంతో బుధవారం సాయంత్రం 6గంటలకు మృతి చెందినట్లు తెలిపారు. శిశువు మృతితో కలత చెందిన తల్లిదండ్రులు ఆసుపత్రి యాజమాన్యంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.


ఇక ఇదే నీలోఫర్ ఆసుపత్రిలో 18 నెలల చిన్నారి కిడ్నాప్‌కు గురైంది. గుర్తు తెలియని మహిళ ఆ చిన్నారిని ఎత్తుకెళ్లింది. ఆ దృశ్యాలు ఆసుపత్రి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు, చిన్నారి అపహరణకు గురికావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ చిన్నారిని తిరిగి తమ చెంతకు చేర్చాలని ధీనంగా వేడుకుంటున్నారు. 


Also Read: Deal of the Day: 12 గంటల్లో ముగియనున్న ఆఫర్.. ₹22,990 విలువైన వివో Y33T ఫోన్ కేవలం ₹3,640 కే!


ALso Read: Samsung Galaxy Z Flip: రూ.96,000 విలువైన శాంసంగ్ స్మార్ట్ ఫోన్ ను రూ.36 వేలకే కొనేయండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook