Telangana Govt Jobs: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. త్వరలోనే ఉద్యోగాల భర్తీ చేపడతామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని.. సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో నిరుద్యోగులే కీలక భూమిక పోషించారని గుర్తు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత ప్రభుత్వంలో భర్తీ చేసిన 7,094 స్టాఫ్‌ నర్సు ఉద్యోగులకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో మంగళవారం నియామక పత్రాలను ప్రభుత్వం అందజేసింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. 'నిరుద్యోగుల కలల సాకారం చేయడంలో ఇది తొలి అడుగు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసేందుకు నిరుద్యోగ యువతే కారణం. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదు. తమ కుటుంబసభ్యులకు పదవుల గురించి తప్ప నిరుద్యోగులకు న్యాయం చేయాలనే వాళ్లు చేయలేదు. ఎన్నికల తర్వాత వారి ఉద్యోగాలు ఊడగొట్టగానే మీకు ఉద్యోగాలు వచ్చాయి. ఉద్యోగాల భర్తీకి ప్రయత్నాలు చేస్తుంటే మాజీ మంత్రి హరీశ్‌ రావు మాత్రం శాపనార్థాలు పెడుతున్నాడు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు' అని తెలిపారు.


'పేదలకు ఉద్యోగాలు ఇచ్చి వారి కళ్లలో ఆనందం చూసే ప్రభుత్వం ఇది. ఆరోగ్య తెలంగాణ నిర్మించడంలో వారిదే కీలక పాత్ర. టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనలో భాగంగా కొత్త చైర్మన్‌, సభ్యులను నియమించాం. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు. విద్యార్థుల త్యాగాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. ఇకపై నిరుద్యోగుల ఆశలు నెరవేరుస్తామని ప్రకటించారు.

Also Read: Kumari Aunty Trending: కుమారి ఆంటీని బిగ్‌బాస్‌కు పంపాలి.. లేదంటే ఎమ్మెల్యేగా చేయాలి

Also Read: Women Cheat Delhi Hotel: స్టార్‌ హోటల్‌లో మోసం చేయబోయి చిక్కిన తెలుగింటి మహిళ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook