Kumari Aunty Trending: కుమారి ఆంటీని బిగ్‌బాస్‌కు పంపాలి.. లేదంటే ఎమ్మెల్యేగా చేయాలి

Kumari Aunty Bigg Boss: కుమారి ఆంటీని బిగ్‌బాస్‌ పంపించాలి.. లేదంటే రాజకీయాల్లోకి తీసుకుని ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలంటూ ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ స్పందనతో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చిన కుమారి ఆంటీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 31, 2024, 08:15 PM IST
Kumari Aunty Trending: కుమారి ఆంటీని బిగ్‌బాస్‌కు పంపాలి.. లేదంటే ఎమ్మెల్యేగా చేయాలి

Kumari Aunty Food Street: ఇన్నాళ్లు సోషల్‌ మీడియా ద్వారా ట్రెండింగ్‌లో ఉన్న సాయి కుమారి ఆంటీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లోకి వచ్చారు. జనవరి 31న ట్విటర్‌, ఫేసుబుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర సోషల్‌ మీడియాలో జాతీయ స్థాయిలో కుమారి ఆంటీ ట్రెండయ్యారు. పోలీసుల కేసు నమోదుతో కుమారి ఆంటీపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. వెంటనే ఆమెపై కేసు వెనక్కి తీసుకోవాలని.. కుమారి ఆంటీ యథావిధిగా తన ఫుడ్‌ ట్రక్‌ను కొనసాగించవచ్చని సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయి.

తెలంగాణ ప్రభుత్వం స్పందనతో మరోసారి కుమారి ఆంటీ హాట్‌ టాపిక్‌ అయ్యారు. ఈసారి తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా కుమారి ఆంటీ పేరు మార్మోగింది. ఇక ప్రభుత్వం తన వ్యవహారంలో స్పందించడంతో కుమారి ఆంటీ ఉబ్బితబ్బిబయ్యారు. ఈ పరిణామాలతో ఒక్కసారిగా కుమారి ఆంటీ ఫుడ్‌ ట్రక్‌ వద్ద ప్రజలు బారులు తీరారు. పెద్ద ఎత్తున జనాలు తరలిరావడంతో ఆమె ట్రక్‌ వద్ద కిక్కిరిసింది. మరోసారి ట్రాఫిక్‌ జామ్‌కు కారణమైంది. అయితే ఈసారి ప్రభుత్వమే స్పందించడంతో పోలీసులు ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

సీఎం స్పందనతో కుమారి ఆంటీ ఫుడ్‌ ట్రక్‌ కిటకిటలాడింది. భోజనం తీసుకోవడానికి కొన్ని నిమిషాల పాటు ఆగాల్సి వచ్చింది. పెద్ద ఎత్తున క్యూలైన్‌ ఏర్పడింది. ఇక ప్రజల రద్దీతో హైటెక్‌ సిటీ, కేబుల్‌ బ్రిడ్జి ప్రాంతంలో వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. వాహనదారులు పరస్పరం ఘర్షణకు దిగిన సంఘటనలు కూడా జరిగాయి. తాజా పరిణామంతో మరోసారి మీడియా, యూట్యూబ్‌ చానళ్లు కుమారి ఆంటీ వద్దకు వెళ్లాయి.

భోజనం చేస్తున్న వారి అభిప్రాయాలు అడగ్గా.. ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించారు. 'భోజనం చాలా బాగుంది. ఇంట్లో వండినట్లు ఉంది' అని కొందరు చెప్పగా.. మరికొందరు 'కుమారి ఆంటీని బిగ్‌బాస్‌కు పంపించాలి. లేదంటే చూసుకోండి' అని చెప్పారు. ఇంకొందరైతే 'కుమారి ఆంటీకి జై' అని నినాదాలు చేశారు. 'రాజకీయాల్లోకి ఆంటీకి తీసుకుందాం.. ఎమ్మెల్యేను చేసుకుందాం' అని చెబుతున్నారు. మారిన పరిస్థితుల కారణంగా కుమారి ఆంటీ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చారు. మరి ఇచ్చిన మాట ప్రకారం కుమారి ఆంటీ ట్రక్‌ వద్దకు తెలంగాణ సీఎం వస్తారో లేదో చూడాలి.

Also Read: Kumari Aunty: స్ట్రీట్‌ ఫుడ్‌ కుమారి ఆంటీపై పోలీస్ కేసు.. ఆందోళనలో ఆమె అభిమానులు

Also Read: Women Cheat Delhi Hotel: స్టార్‌ హోటల్‌లో మోసం చేయబోయి చిక్కిన తెలుగింటి మహిళ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News