Rangam Bhavishyavani: వైభవంగా జరిగిన స్వర్ణలత రంగం భవిష్యవాణి .. అమ్మవారు ఏంచెప్పారంటే..?
Secunderabad bonalu 2024: సికింద్రాబాద్ లో రెండు రోజుల పాటు ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాలు కన్నుల పండుగగా జరిగాయి. ఉజ్జయిని బోనాలకు జంట నగరాల నుంచి కాకుండా.. ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు హజరయ్యారు.
Ujjaini Mahankali Swarna Latha bhavishyavani at secunderabad temple: తెలంగాణలో బోనాల పండుగ ఘనంగా జరుగుతుంది. ఇక హైదరబాద్ బోనాలు గురించి ప్రత్యేకంగాచెప్పనవసరం లేదు. ప్రతి వీధి, గుడి కూడా ఎంతో అందంగా అలంకరించారు. అంతేకాకుండా అమ్మవారికి భక్తితో బోనాలను సమర్పించుకున్నారు. ఇక సికింద్రాబాద్ లో రెండు రోజుల పాటు బోనాలు ఘనంగా జరిగాయి. ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కల్గకుండా అధికారులు పకట్భంది చర్యలు తీసుకున్నారు.అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఘనంగా బోనాలు నిర్వహించారు.
ఈ సారి వర్షంలో కూడా భారీగా భక్తులు తరలివచ్చారు. అధికారులు వీఐపీలకు, బోనంతో వచ్చేమహిళా భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు కల్గకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు బట్టలను సమర్పించారు. అదే విధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ఆ తర్వాత రాజకీయ ప్రముఖులు, సెలబ్రీటీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తునవచ్చి మొక్కులు తీర్చుకున్నారు. జోగినీలకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా.. ఉజ్జయినీ బోనాల జాతరలో భాగంగా ఈరోజు (జులై 22)న రంగం కార్యక్రమం వేడుకగా జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినతర్వాత తొలి బోనాల పండుగ కావడంతో నేతలు సైతం.. రంగం కార్యక్రమంలో అమ్మవారు ఏంచెబుతారో అని ఆసక్తిగా ఎదురు చూశారు.
అమ్మవారు ఏంచెప్పారంటే..
ప్రతిఏడాది మాదిరిగానే ఈ సారి కూడా జోగిని స్వర్ణలత పచ్చికుండపై నిలబడి రంగం భవిష్యవాణిని వినిపించారు. ఈ సమయంలో స్వర్ణలతను అమ్మవారు ఆవహించి ఉన్నది ఉన్నట్లు చెబుతారని, ఆమె చెప్పింది పొల్లుపోకుండా జరుగుందని కూడా భక్తులు విశ్వసిస్తుంటారు. ఇదిలా ఉండగా.. స్వర్ణలత జోగిని మాట్లాడుతు.. భక్తులు చేసిన పూజలు, బోనాలకు ఎంతో ఆనందం కల్గించిందన్నారు. ఈ క్రమంలో పూజారులు మాట్లాడుతూ.. భక్తులు..కుండపోతగావర్షం కురుస్తున్న భక్తులు తన దర్శనానికివచ్చారన్నారు.
దీనికి స్వర్ణలత..భక్తులు వర్షంలో సైతం రావడం ఆనందం అనిపించిందని అమ్మవారు అన్నారు. అంతేకాకుండా.. ఈ ఏడాది ఐదువారాల పాటు పప్పు బెళ్లాలతో సాక పెట్టాలని భక్తులను అమ్మవారు ఆజ్జాపించారు. అదేవిధంగా వ్యవసాయంలో ఎక్కువగా రసాయనాలు ఉపయోగిస్తున్నారని, అలా వాడకం తగ్గించాలని కూడా అమ్మవారు ఆదేశించారు. లేకుంటే వ్యాధులు చుట్టుముడతాయంటూ అమ్మవారు హెచ్చరించారు.
ఎవరు భక్తితో ఎలాంటి బోనం తీసుకొచ్చిన ఆనందంగా స్వీకరిస్తానని అమ్మవారు అన్నారు. నా రూపం పెట్టాలి అనుకుంటున్నారు కదా .. పెట్టండి. ఎవరు ఏం చేసినా, ఎవరెంత అడ్డుపడినా నా రూపం నేను పెట్టించుకుంటానని.. తప్పని సరిగా నా రూపాన్ని నేను నిలబెట్టుకుంట అంటూ అమ్మవారు అన్నారు. బలిగురించి మాట్లాడుతూ.. రక్త పాశం ఇవ్వడం లేదు. మీకు నచ్చింది ఇస్తున్నారు. దానితోనే సంతోష పడుతున్నట్లు అమ్మవారు చెప్పారు. ఎవరికి ఎలాంటి కష్టం రాకుండా.. కాపాడతానంటూ కూడా అమ్మవారు భక్తులకు తానున్నానని భరోసా ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి