Ujjaini Mahankali Bonalu: పచ్చి కుండపై నిలబడి రంగం .. దీని వెనుక ఉన్న ఉజ్జయినీ అమ్మవారి మహత్యం తెలుసా..?

Lashkar bonalu 2024: సికింద్రాబాద్ లో ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి తొలిబోనం సమర్పించారు.

Written by - Inamdar Paresh | Last Updated : Jul 21, 2024, 02:34 PM IST
  • వేడుకగ ప్రారంభమైన ఉజ్జయినీ జాతర..
  • రంగం మీద కాంగ్రెస్ నేతల ఆసక్తి..
Ujjaini Mahankali Bonalu: పచ్చి కుండపై నిలబడి రంగం .. దీని వెనుక ఉన్న ఉజ్జయినీ అమ్మవారి మహత్యం తెలుసా..?

secunderabad ujjaini Mahankali bonalu 2024 rangam bhavishyavani: ఆషామాసం బోనాల నేపథ్యంలో తెలంగాణ అంతట పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఆషాడంలో అమ్మవారు పుట్టింటికి వస్తుందని చెబుతుంటారు. అందుకే బోనాలను ఘనంగా జరుపుకుంటారు. బోనం అంటే భోజనం అని అర్ధం. కుండలో అమ్మవారికి భోజనం(నైవేద్యం) తీసుకెళ్లి అమ్మవారికి అర్పించి మరల ఇంటికి ప్రసాదంగా తెచ్చుకుంటారు. ఇలా అనాదీగా వస్తున్న ఆచారంను పాటిస్తున్నారు.  తమ  ఇంట్లోని సంప్రదాయాలను అనుసరించి బోనాలు జరుపుకుంటారు. హైదరాబాద్ లో బోనాలను ఎంతో వేడుకగా జరుపుకుంటారు.

Read more: Snake in shoe: వానాకాలంలో ఇలాంటి ప్రమాదాలతో జాగ్రత్త.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..

ముఖ్యంగా.. గోల్కోండ, బల్కంపేట ఎల్లమ్మ, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ, పాతబస్తీ సింహావాహిని, చార్మినార్ దగ్గర మొదలైన చోట్ల బోనాలను భక్తుల ఘనంగా జరుపుకుంటారు. అమ్మవారికి బోనం, తొట్లేలు, ఫలహారం బండ్లను సమర్పిస్తుంటారు. దీని వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. ఇదిలా ఉండగా..సికింద్రాబాద్ లో ఉజ్జయినీ అమ్మవారిఆలయంలో రెండు రోజుల పాటు బోనాల పండుగను నిర్వహిస్తారు.

మొదటి రోజు భక్తులు నగరంనుంచి పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తుంటారు.దీనికోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి  కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంది. అన్నిశాఖలు సమన్వయంచేసుకుని భక్తులకు ఇబ్బంది కల్గించకుండా చూడాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ అమ్మవారికి పట్టు వస్త్రాలు, పొన్నం ప్రభాకర్ తొలిబోనం సమర్పించారు. ఉదయం వేకువ జామున నుంచి భక్తులు భారీగా అమ్మవారికి బోనాలు సమర్పించడానికి భారులు తీరారు. ఇదిలా ఉండగ.. ఉజ్జయినీ మహంకాళి ఆలయం దగ్గర రెండో రోజున ఫలహారం బండ్ల ఊరేగింపు, అమ్మవారిని అంబారీపైన ఊరేగించడం, రంగం కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా రంగం భవిష్యవాణిని భక్తులు ఎంతో విశ్వసిస్తుంటారు. ఉజ్జయినీ అమ్మవారు రంగం చెప్పే మహిళలో పూనుతారని చెబుతుంటారు. 

పచ్చి కుండ చరిత్ర..

సాధారణంగా కుండ ఎంతో డెలీకెట్ గా ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న వెంటనే పగిలిపోతుంది. అలాంటిటి ఉజ్జయినీ ఆలయంలో రెండో రోజు సాయత్రం పూట రంగం కార్యక్రమం నిర్వహిస్తారు.ఈ కార్యక్రమంలో స్వర్ణలత అనే జోగినీ ప్రతిఏడాది కూడా రంగం చెబుతుంది. ఆమె ఒళ్లంతా పసుపు పూసుకుని, చేతిలో వేప ఆకులు, పెద్ద బోట్టు పెట్టుకుని చూస్తేనే కాస్తంతా భయంకల్గించే విధంగా ఉంటుంది. ఇదిలా ఉండగా.. స్వర్ణలత.. పచ్చికుండపై నిలబడీమరీ భవిష్యత్తు చెబుతుంది. ఆమె పచ్చికుండపై నిలబడిన కూడా ఆకుండ పగిలిపోదు. అమ్మవారు ఆమెలో ప్రవేశించడనడానికి అదే నిదర్శనమి భక్తులు చెబుతుంటారు.

Read more: king Cobra: వామ్మో.. చెట్టు మీద 12 అడుగుల భారీ కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే మాత్రం హడలెత్తిపోతారు..

ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి బోనాలు నిర్వహించారు.ఈ క్రమంలో రంగం కార్యక్రమంలో ఏచెబుతారో అనేదానిపై కాంగ్రెస్ నేతలు ఉత్కంఠగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో హైదరాబాద్ కుండ పోత వర్షానికి, ఉజ్జయిని మహంకాళి ఆలయంలో సరిగ్గా పూజలు చేయకపోవడమే కారణమని కూడా స్వర్ణలత పచ్చి కుండపై నిలబడి చెప్పింది. ఈ సారి ఏకంగా కాంగ్రెస్ సర్కాను జోగీనీలు పలుమార్లు దూశించారు. చివరకు ప్రభుత్వ పెద్దలు, జోగీనీలతో సమావేశం కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో.. కాంగ్రెస్ కు చెందిన కొందరు నేతలు మాత్రం అమ్మవారు రంగం ఏచెబుతుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంట.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News