CM Revanth Reddy: భారత న్యాయవ్యవస్థ మీద అపార నమ్మకం ఉంది.. ఎక్స్ లో తీవ్ర విచారం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి..
Cm revanth reddy clarity on his comments: తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా తన వ్యాఖ్యల పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తనకు సుప్రీంకోర్టు మీద అపారమైన నమ్మకం ఉందన్నారు.
cm revanth reddy regret his comments on Kavitha bail: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాదాపుగా.. ఐదునెలల తర్వాత అత్యున్నత ధర్మాసనం కవితకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. ఢిల్లీలిక్కర్ స్కామ్ కేసులో ఈడీ, సీబీఐ అధికారులు కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆమె గత ఐదు నెలలుగా ఢిల్లీలోని తీహార్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈ క్రమంలో.. కవితకు బెయిల్ రావడంపై సీఎం రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ, బీఆర్ఎస్ లు అంతర్గతంగా ఒక్కటేనని, ఎంపీ సీట్లు వదులుకున్నందుకు.. కవితకు బెయిల్ వచ్చిందని కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై తాజాగా, సుప్రీంకోర్టు స్పందించింది. నిన్న (గురువారం ) 2015 నాటి నోటుకు ఓటు కేసు విచారణను సుప్రీంకోర్టులో గవాయితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
ఈకేసు విచారణ నేపథ్యంలో.. ధర్మాసనం.. కవిత బెయిల్ విషయంలో రేవంత్ మాట్లాడిన మాటల్ని అత్యున్నత ధర్మాసనం తప్పుపట్టింది. తాము న్యాయబద్ధంగా నిర్ణయం తీసుకుంటామని, ఒకరి నుంచి వచ్చిన సూచనలు, ఆదేశాలను బట్టి తమ విచారణ ఉండదని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. ఒక సీఎం స్థాయి వ్యక్తిఇలా వ్యాఖ్యలు చేయడం సరికాదని కూడా గవాయితో కూడిన ధర్మాసనం చురకలు పెట్టింది. దీంతో ఈ ఘటన కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది.
దీనిపై సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ,ఎక్స్ వేదికగా స్పందించారు. తన వ్యాఖ్యల్ని కొంత మంది కావాలని వక్రీకరించారన్నారు. తనకు సుప్రీంకోర్టు మీద, భారత న్యాయవ్యవస్థ మీద అపారమైన నమ్మకముందని క్లారిటీ ఇచ్చారు. తన వ్యాఖ్యల పట్ల బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నట్లు కూడా ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చారు.
కొంత మంది కావలని పనికట్టుకుని మరీ.. తన ప్రతిష్టను దిగజార్చేలా వక్రీకరించారని కూడా రేవంత్ అన్నారు. ఇదిలా ఉండగా.. ఓటుకు నోటు కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు.. ఈ కేసు విచారణకు ప్రత్యేకంగా ఇండిపెండెంట్ ప్రాసిక్యూటర్ ను నియమిస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా..తదుపరి విచారణను సెప్టెంబర్ 2 కు వాయిదావేస్తున్నట్లు తెలిపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.