Kishan Reddy: పూర్తయిన కేంద్ర కేబినెట్ విస్తరణ, కిషన్ రెడ్డికి ప్రమోషన్
Kishan Reddy: కేంద్ర మంత్రివర్గం విస్తరించింది. కొందరికి ఉద్వాసన, ఇంకొందరికి ప్రమోషన్, మరి కొందరికి మంత్రివర్గంలో చోటు. ఇలా సాగిన కేంద్ర కేబినెట్ విస్తరణలో తెలుగు వ్యక్తికి ప్రమోషన్ లభించింది.
Kishan Reddy: కేంద్ర మంత్రివర్గం విస్తరించింది. కొందరికి ఉద్వాసన, ఇంకొందరికి ప్రమోషన్, మరి కొందరికి మంత్రివర్గంలో చోటు. ఇలా సాగిన కేంద్ర కేబినెట్ విస్తరణలో తెలుగు వ్యక్తికి ప్రమోషన్ లభించింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra modi) తన కేబినెట్‌ను విస్తరించారు. కేబినెట్ విస్తరణ(Union Cabinet Extension)తో పాటు ప్రక్షాళన కూడా కన్పించింది. కొందరు మంత్రులకు ఉద్వాసన కలిగింది. ఇంకొందరికి ప్రమోషన్ లభించింది. కొత్తగా చాలామందికి మంత్రివర్గంలో చోటు లభించింది. ఈ నేపధ్యంలో తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డికి పదోన్నతి లభించడం విశేషం. ప్రస్తుత మంత్రివర్గంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి ఇప్పుడు కేబినెట్ మంత్రి హోదా ఇచ్చారు. పదవిలో పదోన్నతితో పాటు భాషలో కూడా కిషన్ రెడ్డి పట్టు సాధించినట్టున్నారు. కేంద్ర సహాయమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు హిందీలో తడబాటు కన్పించింది. ఇటీవలి కాలంలో హిందీ భాషపై సాధించిన పట్టును కేబినెట్ మంత్రిగా (Kishan reddy got cabinet rank)ప్రమాణ స్వీకారం చేస్తూ చూపించారు.
కిషన్ రెడ్డికి (Kishan Reddy)ఇంకా శాఖ కేటాయింపు జరగలేదు. కేంద్ర కార్మిక శాఖ స్వతంత్రహోదాలో ఉన్న సంతోష్ గాంగ్వార్ రాజీనామా నేపధ్యంలో కిషన్ రెడ్డికి ఆ శాఖ అప్పగించవచ్చనే వార్తలు విన్పిస్తున్నాయి. గతంలో తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్‌కు ప్రాతినిధ్యం వహించిన బండారు దత్తాత్రేయ కూడా ఇదే శాఖను నిర్వహించడంతో..కిషన్ రెడ్డికీ అదే ప్రాప్తిస్తుందనే ఉహాగానాలు విన్పిస్తున్నాయి.
Also read: Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook