Bandi Sanjay: కాంగ్రెస్ ఎమ్మెల్యేను అభినందించిన బండి సంజయ్.. ఎందుకో తెలుసా..!
Union Minister Bandi Sanjay: ఎన్నికల వరకే రాజకీయాలు అని.. నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా కృషి చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అధిక నిధులు కేటాయిస్తోందని.. రాజకీయాలు పక్కనబెట్టి అభివృద్ధి కోసం కష్టపడాలని సూచించారు.
Union Minister Bandi Sanjay: ‘‘పగలు, పంతాలు, రాజకీయ కక్షలతో సాధించేదేమీ లేదు. కార్యకర్తలు కొట్టుకోవడం, గొడవలు పడటం తప్ప. ఎన్నికల వరకే రాజకీయాలు. ఆ తరువాత రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధి చేసుకుందాం. ప్రజల ఆకాంక్షలను నెరవేరుద్దాం’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నడూ ప్రోటోకాల్ పాటించలేదని, కేంద్రం మంజూరు చేసిన నిధులను కూడా దారి మళ్లించిందని మండిపడ్డారు. కమీషన్లు, పేరు ప్రఖ్యాతలకే ప్రాధాన్యమిచ్చిందే తప్ప నిబంధనల ప్రకారం పనిచేయలేదని, అధికారులను కూడా పనిచేసుకోనివ్వలేదని అన్నారు.
Also Read: Karthika masam 2024: కార్తీక మాసంలో తులసీ వివాహాం విశిష్టత.. ఏ రోజున దీన్ని చేయాలి..?..
శనివారం ఉదయం చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండల కేంద్రానికి విచ్చేసిన బండి సంజయ్ స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభతో కలిసి రూ.25 కోట్ల వ్యయంతో మల్యాల చౌరస్తా నుంచి కాచారం వరకు నిర్మిస్తున్న డబుల్ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా నేతలతో కలిసి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమాన్ని పూర్తి చేయడాన్ని గమనించిన బండి సంజయ్ ఆనందం వ్యక్తం చేశారు.
"అందరికీ నమస్కారం.. చాలా రోజుల తరువాత ప్రోటోకాల్ ను పాటించడం కన్పించింది. ఇది మంచి వాతావరణం. అధికారులు కూడా ఆనందంగా ఉన్నారు. గతంలో ఎట్లుందో మీరు చూశారు. గత బీఆర్ఎస్ పాలనలో ప్రోటోకాల్ పాటించలే. నిబంధనలను ఉల్లంఘించు. కమీషన్లకే పరిమితమై పనులు చేయలే. నిబంధనలు పాటించలే. అధికారులను కూడా పని చేయకుండా ఒత్తిడి తెచ్చారు. పేరు ప్రఖ్యాతులకే బీఆర్ఎస్ ప్రాధాన్యతనిచ్చింది. కమీషన్లు దండుకున్నారు. గతంలో కేంద్రం మంజూరు చేసిన నిధులను దారి మళ్లించారు.
ఎన్నికల వరకే రాజకీయాలు.. నియోజక వర్గ అభివృద్ది కోసం పార్టీలకు అతీతంగా కలిసి పనిచేయాలన్నదే మా అభిమతం. ఈసారి కేంద్రం ఇచ్చిన నిధులను సద్వినియోగమయ్యేలా ఈరోజు మంజూరు చేసిన రూ.25 కోట్ల నిధులను మల్యాల నుంచి కాచారం వరకు డబుల్ లేన్ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉంది. రోడ్డు విస్తరణ కోసం నిధులు మంజూరు చేసిన ప్రధాని మోదీ గారికి, నితిన్ గడ్కారీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి గడ్కరీ అత్యధిక నిధులు మంజూరు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి అత్యధికంగా సీఆర్ఐఎఫ్ నిధులు కేటాయించారు. మోదీకి, గడ్కరీకి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నా.
పగలు, పంతాలతో సాధించేదేమీ లేదు. కార్యకర్తలు కొట్టుకోవడం, గొడవలు జరగడం తప్ప జరిగేదేమీ లేదు. గొడవలు పక్కనపెట్టి రాజకీయాలకు అతీతంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ఈ రోడ్డు విస్తరణ పనుల విషయంలో సహకరిస్తున్న స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు అభినందనలు." అని బండి సంజయ అన్నారు.
Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.